Tuesday, November 19, 2024

AP కృష్ణా నదీ తీరంలో మహాద్భుతం – కళ్లు జిగేల్మనిపించిన డ్రోన్ షో

( ఆంధ్రప్రభ విద్యాధరపురం)అమరావతి డ్రోన్ సమ్మిట్ లో భాగంగా విజయవాడ కృష్ణా నదీ తీరంలో నిర్వహించిన దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో కళ్లు జిగేల్మనిపించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో ముగిశాక… 5 వేలకు పైగా డ్రోన్లు గాల్లోకి లేచాయి.

డ్రోన్లు వివిధ కళాకృతులతో అందరినీ అలరించాయి. విమానం, బుద్ధుడు, గ్లోబ్ పై భారతదేశ మ్యాప్, డ్రోన్ కల్చర్, 1911 నాటి పోస్టల్ స్టాంపు, భారత త్రివర్ణ పతాకం… ఇలా వివిధ రూపాల్లో డ్రోన్ లైటింగ్ షో కనులవిందు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు.

కాగా, ఈ డ్రోన్ షోను ప్రజలు వీక్షించేందుకు వీలుగా విజయవాడలో ఐదు చోట్ల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు ఈ భారీ ఈవెంట్ కు హాజరై అత్యంత ఆసక్తితో తిలకించారు. ఈ కార్యక్రమంలో, సీఎం చంద్రబాబు డ్రోన్ హ్యాకథాన్ విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేశారు

- Advertisement -

. డ్రోన్ షో సందర్భంగా పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ‘కృష్ణం వందే జగద్గురుం’ కళా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తమ్మీద ఈ డ్రోన్ షో ఏపీ ప్రభుత్వ విజన్ ను చాటేలా, టెక్నాలజీ పట్ల సీఎం చంద్రబాబు అనురక్తిని వెల్లడించేలా సాగింది

Advertisement

తాజా వార్తలు

Advertisement