తెలుగు రాష్ట్రాలకు రెండు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఏపీ నుంచి దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలు, తెలంగాణ నుంచి నాగపూర్-సికింద్రాబాద్ రైలును ప్రారంభించారు.
దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలు… దుర్గ్ నుంచి వారానికి ఆరు రోజులు (గురువారం మినహా) ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. అదేరోజు మధ్యాహ్నం 1.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమై, రాత్రి 10.50 గంటలకు దుర్గ్‌కు చేరుకుంటుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా తిరగనుంది.
సికింద్రాబాద్-నాగపూర్ వందేభారత్ రైలు ఈ నెల 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. మంగళవారం మినహా మిగతా ఆరు రోజులు ఈ రైలు నడుస్తుంది. ఈ రైలు ప్రతిరోజు ఉదయం 5.00 గంటలకు నాగ్‌పూర్ నుంచి బయలుదేరి సేవాగ్రామ్, చంద్రాపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేట మీదుగా సికింద్రాబాద్‌కు మధ్యాహ్నం 12.15 గంటలకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 1 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి రాత్రి రాత్రి 8.20 గంటలకు నాగపూర్ చేరుకుంటంది. మహారాష్ట్ర-తెలంగాణ మధ్య ఇదే తొలి వందేభారత్ రైలు. అంతేకాదు, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇదే అతిపెద్ద వందేభారత్ రైలు. దీంట్లో 20 కోచ్ లు ఉంటాయి