ఏపీ – తెలంగాణ విభజన సమస్యలపై చర్చిద్దాం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఏం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కాగా, తాజాగా అందుకు రేవంత్ రెడ్డి కూడా అంగీకారం తెలిపారు. విభజన చట్టంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు ప్రతిపాదించిన సమావేశానికి తాను అంగీకరిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తరపున చంద్రబాబు బాబును సాదరంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. జూలై 6న హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసుకుందామని రేవంత్‌రెడ్డి తెలిపారు.