ఏపీలో టెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 2 లక్షల 67 వేల 559 మంది హాజరై పరీక్షలు రాస్తున్నారు. టెట్ మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 వరకు జరుగుతున్నాయి. రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జరగనుంది.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 120 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష సరళిని పర్యవేక్షించేందుకు జిల్లాకు ఒక అధికారి చొప్పున 26 మందిని… 300 మంది అభ్యర్థులకు ఒక డిపార్ట్‌మెంటల్ అధికారిని నియమించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలోని పరీక్ష కేంద్రాలకు కూడా డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను నియమించారు అధికారులు. హైకోర్టు ఆదేశం మేరకు బీఈడీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, డీఈడీ అభ్యర్థులు ఎస్‌జీటీ పోస్టుల టెట్ మాత్రమే రాయాల్సి ఉంది.