Thursday, November 21, 2024

AP కొలువుల జాత‌ర‌! టెట్ ప‌రీక్ష‌లు ప్రారంభం

కూట‌మి స‌ర్కారు ఇచ్చిన‌ హామీ అమ‌లు
బాధ్య‌త‌లు తీసుకున్న రోజే మెగా డీఎస్సీ ఫైలుపై చంద్ర‌బాబు సంత‌కం
టెట్ కోసం పెద్ద ఎత్తున పోటీ
4.27 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థుల ఆస‌క్తి
4.13 ల‌క్ష‌ల మంది హాల్ టికెట్లు డౌన్‌లోడ్
ఆన్‌లైన్ విధానంలో ప‌రీక్ష‌లు
ఏపీ, తెలంగాణ‌లో 13 ప‌రీక్షా కేంద్రాలు
త‌నిఖీలు, ఫ్లైయింగ్ స్వ్కాడ్ నిఘా
ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేసిన ప్ర‌భుత్వం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, విజ‌య‌వాడ‌

ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి ఈనెల 21 వ తేదీ వరకు 17రోజుల పాటు ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. రోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెషన్-1 నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెషన్ -2 నిర్వహిస్తారు. దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాల సమయం కేటాయిస్తారు.

108 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
ఈసారి ఏపీ వ్యాప్తంగా 108 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్​లోని 22 జిల్లాలో 95 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపూర్, గంజాంలలో కలిపి 13కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లోని కేంద్రాల్లో 24,396 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.

- Advertisement -

సెల్‌ఫోన్‌, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు నిషేధం..

పరీక్ష సమయానికి గంటన్నర ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు తప్పని సరిగా ఆధార్ ​కార్డు, డ్రైవింగ్​ లైసెన్స్, ఓటర్ కార్డుల్లో ఏదో ఒకదాన్ని వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సెల్​ఫోన్, ట్యాబ్, ల్యాప్​టాప్, కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా, ఫొటో చిన్న సైజులో ఉన్నా అభ్యర్థి 2 పాస్​పోర్ట్ సైజు ఫొటోలను తీసుకుని సంబంధిత డిపార్ట్​మెంట్​ అధికారికి సమర్పించి అనుమతి పొందాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. హాల్​టికెట్లలో ఏవైనా తప్పులుంటే పరీక్షా కేంద్రంలోని డిపార్టుమెంట్ అధికారికి ఆధారాలు చూపించి వాటిని సరిచేసుకునే సదుపాయం కల్పించారు.

త‌నికీలు, ఫ్లైయింగ్ స్వ్కాడ్‌..

పరీక్షల్లో ఎక్కడా అవకతవకలు, అక్రమాలు జరగకుండా ఫ్లైయింగ్ స్క్వాడ్, జిల్లా పరిశీలకులు, తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. ఆన్​లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తుండటం వల్ల విద్యుత్ సరఫరా సహా సాకేంతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు సహా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్షకు హాజరైనా, మాల్ ప్రాక్టీస్​కు పాల్పడినా అభ్యర్థిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement