అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు శనివారం ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో శుక్రవారం జరిగిన చర్చల సందర్భంగా మంత్రి బొత్స స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలను 6.5లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగ్గా 19 నుంచి 26వరకు స్పాట్ వాల్యుయేషన్ చేపట్టారు. అది పూర్తి కావడంతో ట్యాబ్లేషన్ అనంతరం ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం చేశారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement