ఏపీలో పదో తరగతి మార్కుల కేటాయింపులో ఫార్మెటివ్ రాత పరీక్షకు 70శాతం వెయిటేజీ ఇవ్వాలని ఛాయరతన్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయించింది. 50 మార్కులకు పెట్టిన ఫార్మెటివ్ పరీక్షలో.. రాత పరీక్షకు 20 మార్కులు, ప్రాజెక్టులకు 10, నోటుపుస్తకాల రాతకు 10, తరగతిలో పిల్లల భాగస్వామ్యానికి 10 మార్కులు ఇచ్చారు. ప్రస్తుతం మార్కులు ఇచ్చేందుకు రాత పరీక్షకు 70శాతం, ఇతర మార్కుల్లో 30శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది రెండు ఫార్మెటివ్ పరీక్షలు నిర్వహించారు.
పదవ తరగతి మార్కుల లెక్కింపును ఈ విధంగా చేయనున్నారు.. ఫార్మెటివ్ పరీక్ష మొత్తం 50 మార్కులు. దీనిలో రాత పరీక్షను 70శాతం అంటే 20 మార్కులను 35కు తీసుకువస్తారు. మిగతా 30 మార్కులను 30శాతం వెయిటేజీతో 15మార్కులకు కుదిస్తారు.
- ఒక విద్యార్థికి రాత పరీక్షలో 20 మార్కులకుగాను 18 వచ్చాయనుకుంటే 35 మార్కులకు పెంచడం(18X35/20)తో 31.5 మార్కులకు చేరతాయి.
- మిగతా 30 మార్కులను 15కు కుదిస్తారు. అంటే.. విద్యార్థికి 30మార్కులకుగాను 27 వస్తే వెయిటేజీ ప్రకారం(15X27/30) 13.5గా తీసుకుంటారు.
- మొత్తం కలిపి ఫార్మెటివ్‌లో 45 మార్కులు వచ్చినట్లు పరిగణిస్తారు.
- ఇలాగే మరో ఫార్మెటివ్‌నూ లెక్కిస్తారు. రెండింటిలో వచ్చిన మార్కులను కలిపి సబ్జెక్టు గ్రేడ్ ప్రకటిస్తారు.
- అన్ని మార్కుల కలిపి మొత్తం గ్రేడ్ ఇస్తారు.
ఇది కూడా చదవండి:డెల్టా వేరియంట్ కేసులు పెరగవచ్చు WHO హెచ్చరిక..