తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. కృష్ణానది జలాల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ప్రాజెక్టుల వద్ద భారీగా భద్రతను పెంచారు. ఇందులో భాగంగా జూరాల ప్రాజెక్టు వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి జూరాల మీద రాకపోకళ్లు నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల కిందా గద్వాల జిల్లా ఎస్పీ రంజన్‌రతన్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు జలవిద్యుత్ కేంద్రాని, జూరాల ప్రాజెక్టును సందర్శించారు. వివాదం నెలకొన్న నేపథ్యంలో జూరాలకు భద్రత పెంచినట్లు తెలుస్తోంది. కృష్ణా జలాల వినియోగంపై కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో జూరాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అటు శ్రీశైలం, నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రాల్లో వందశాతం విద్యుత్ ఉత్పత్తి చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇరు రాష్ట్రాల మద్య నెలకొన్న జల వివాదం…. కారణంగా జూరాల మీద పూర్తి స్థాయిలో రాకపోకలు నిలిపివేయనున్నట్లు సమాచరం. పరిసర ప్రాంతాల వారిని జూరాల మీదుగావెళ్లే వారి ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసినట్లు పరిసర ప్రాంతాల ప్రజలకు తెలిపారు.
ఇది కూడా చదవండి: వైఎస్ షర్మిల ఆఫీస్ ముట్టడికి ఏపీ పరిరక్షణ సమితి యత్నం