అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో మూడేళ్ల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, ఆ మేరకు యూనిర్సిటీలన్నీ ఈ మూడేళ్లలో పూర్తిగా బాగుపడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతివారం ఒక వీసీతో సమావేశం కావాలని, యూనివర్సిటీ-ల్లో సమస్యలు, ప్రభుత్వపరంగా అందించాల్సిన తోడ్పాటు-పై చర్చించాలని ఉన్నత విద్యా మండలికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆ సమావేశంలో గుర్తించిన అంశాలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇలా రాష్ట్రం లో ప్రతి యూనివర్సిటీ- వీసీతోనూ విడివిడిగా సమా వేశాలు నిర్వహించాలని చెప్పారు. ఈ సమావేశాల్లో యూనివర్సిటీ ప్రస్తుత స్ధాయి, మెరుగుప ర్చుకోవాల్సిన ప్రమాణాలను గుర్తించాలన్నారు. తర్వాత యూనివర్సిటీ-ల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తెలిపారు. వచ్చే మూడేళ్ల కాలానికి ఈవిధమైన కార్యాచరణ రూపొందించాలని, ఆమూ డేళ్లలో ఈ విజన్ అందుకోవాలని సీఎం ఆదేశించారు.
అన్ని యూనివర్సిటీల్లో నాక్ రేటింగ్ అప్‌గ్రేడ్ కావాలన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను యూని వర్సిటీ-లతో ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. అంతర్జాతీయంగా, జాతీయంగా పేరున్న కంపెనీలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో కూడా స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను ఉంచాలని పేర్కొన్నారు. ఇంగ్లిషును మెరుగుపర్చడంపైనా దృష్టిపెట్టాలని, బేసిక్ ఇంగ్లిషు అన్నది తప్పనిసరి సబ్జెక్టుగా పెట్టాలన్నారు. దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. కొత్తగా 16 మెడికల్ కాలేజీలను తీసుకువస్తున్నామని, ఆ కాలేజీలను స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటు-న్నామన్నారు. పరిశోధనల మీద కూడా కొలాబరేట్ చేసుకోవాలని తెలిపారు. జిల్లాల్లో పరిశ్రమలతో అనుసంధానం చేసుకోవాలన్నారు. ఒక్కో యూనివర్సిటీ-లో ఒక్కో రంగానికి సంబం ధించి పరిశోధనలు జరిగేలా పరిశ్రమలతో కొలాబరేట్ కావాలని ఆదేశించారు.
టీచింగ్ పోస్టులు భర్తీ
విశ్వవిద్యాలయాల్లో టీ-చింగ్ స్టాప్‌ను పూర్తిగా భర్తీ చేసుకోవాలని చెప్పారు. ఇక్కడ ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆమోదం తెలిపామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. టీ-చింగ్ స్టాఫ్ లేనప్పుడు యూనివర్సిటీ-లు ఉన్నా.. లాభం ఏమిటని ఈ సందర్భంగా సీఎం ప్రశ్నించారు. టీచింగ్‌లో మంచి అర్హతా ప్రమాణాలు కలిగినవారిని నియమించాలని ఆదేశించారు. నియామకాల్లో అత్యు త్తమ ప్రమాణాలు పాటించాలని, అత్యంత పారద ర్శకంగా ఈ నియామకాలు చేపట్టాలన్నారు. కరిక్యు లమ్‌లో కూడా మార్పులు రావాలని, అప్పుడే నాణ్య మైన విద్య అందించగలుగుతామన్నారు. ఈక్రమం లోనే విద్యా ప్రమాణాలు కూడా మెరుగు పడతాయన్నారు. ఈ మూడు అంశాల్లో మార్పు వచ్చినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.