Thursday, November 21, 2024

AP – వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు రద్దు

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – అమరావతి – ఏపీలో వైసీపీ ప్రభుత్వం లో జరిగిన ఉపాధ్యాయుల బదిలీలను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్క బదిలీకి రూ.3 నుంచి 4 లక్షలు తీసుకొని బదిలీ చేసినట్లు పలువురు మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదులు చేశారు.

దీంతో విచారణ అనంతరం బదిలీల రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు జరిగిన ఉపాధ్యాయుల బదిలీలను రద్దు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. .

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement