Sunday, November 17, 2024

AP – జగన్ ది వికృత మనస్తత్వం …

( ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో )వికృత, పైశాచిక, సైకో మనస్తత్వం ఉన్న జగన్ తన రాజకీయ సమాధిని తానే నిర్మించుకున్నాడని, జగన్ మనస్తత్వాన్ని ముందే గ్రహించిన ప్రజలు ఎన్నికల్లో జగన్కు శాశ్వత సమాధి నిర్మించారని మంత్రులు నిమ్మల రామానాయుడు, పి నారాయణ, విజయవాడ ఎంపీ కేసినేని శివనాద్, తిరువూరు ఎమ్మెల్యే కొడుకు శ్రీనివాస్ విమర్శించారు.

అమరావతిపై అణువణువునా ద్వ్యాసం పెంచుకున్న జగన్ ఇప్పటికీ రాజధానిపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బుడమేరు ముంపు పాపం ముమ్మాటికీ జగన్దే అన్న వీరు, బ్యారేజిని సైతం కోల్చాలనే దుర్మార్గపు ఆలోచనలు జగన్ పన్నాడని విమర్శించారు. బ్యారేజీకి బోట్లు ఢీకొనడం వెనక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించిన మంత్రులు, పార్టీ కార్యాలయం పై దాడి సంఘటనలో ముమ్మాటికి జగనే ముద్దాయి అన్నారు. త్వరలో జైలుకు జగన్ వెళ్లడం ఖాయమని తనకోసం ఒక ఐపిఎల్ టీం ని ఇప్పటి నుంచే జగన్ రెడీ చేసుకుంటున్నాడన్నారు.

రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పాలన ఎన్నడు చూడలేదంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ విజయవాడలోని ఎంపీ కేసినేని శివనాద్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రకాశం బ్యారేజీ కి ఎప్పుడైనా పడవలు కొట్టుకు వచ్చాయా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఒక పడవ కొట్టికి వచ్చిందని ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో కూడా మరోసారి ఐదు బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం వెనక ముమ్మాటికి రాజకీయ కుట్ర ఉందన్నారు. ఇటువంటి వికృతి మనస్తత్వం ఉన్న జగన్ ను అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసి ఒక పక్కన కూర్చోబెట్టారన్నారు.

- Advertisement -

మొన్నటి ఎన్నికల తోనే జగన్ రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ పడినట్లేనన్నారు. బ్యారేజీ కి కొట్టుకు వచ్చిన బోట్ల అంశంపై స్పష్టమైన విచారణ జరగాలని జగన్ చెల్లెలు షర్మిల డిమాండ్ చేసిందని ఆమె ప్రశ్నకు జవాబులు చెప్పాలని డిమాండ్ చేశారు. తన రాజకీయ జీవితం సమాధి కాకూడదనే తన అబద్ధపు ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విపత్తుల సమయంలో ప్రజలకు ఆదుకోవాల్సింది పోయి, బురద రాజకీయాలు చేస్తున్నాడు అన్నారు.

అసలు జగన్కి కృష్ణా పరివాహక ప్రాంతాల గురించి ఏమాత్రం అవగాహన లేదని తుఫాన్ కారణంగా కృష్ణా నదికి ఎంత నీరు వచ్చిందో వరద వచ్చిందో కూడా తెలియలేని పరిస్థితి అన్నారు. అసలు బుడమేరు ఎటు నుంచి ఎటువైపు ప్రవహిస్తుందో కూడా కనీస అవగాహన లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై పిచ్చి ప్రేలపణలు పలకడమే అలవాటుగా జగన్ కు మారిందన్నారు. అమరావతిపై విపరీతమైన ద్వేషం పెంచుకున్నాడని అందుకే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలో ఒక్క సీటు కూడా రాలేదన్నారు. అందుకేనేమో పడవలతో బ్యారేజీని ధ్వంసం చేయాలన్న కుట్ర పన్నాడన్నారు.

పుట్టిన తో పెట్టిన విద్య అని, 8 ఏళ్ల నుంచి జగన్ చేస్తున్న డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మొన్న ఎన్నికలలో ఎదురైన ఓటమి గ్రహించి, తన వక్రబుద్ధిని జగన్ మార్చుకోవాలన్నారు. సుమారు 14 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రకాశం బ్యారేజీ పై కూడా జగన్ కుట్ర గమనిస్తే ఎంత నీచ మనస్తత్వము అర్థం అవుతుందని ఆరోపించారు. ముమ్మాటికి బోట్ల ఢీకొనడం వెనక కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు. బోట్లు కౌంటర్ వైట్లను ఢీకొన్నాయని అదే బ్యారేజీకి ఢీకొని ఉంటే పెను ప్రమాదం సంభవించేదన్నారు. పాలన అంటే తెలియని జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు.

అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపే చంద్రబాబు నాయుడు ఎన్ని డిపార్ట్మెంట్లను ఎంతమంది అధికారులతో సమీక్ష సమావేశాలు పెట్టారో జగన్ తెలుసుకోవాలన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడుతుంటే జగన్ మాత్రం టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి చేసిన నిందితుడిని పరామర్శించడానికి వెళ్లడం చూస్తే ప్రజలపై జగన్కు ఎంత ప్రేమ ఉందో ఇట్టే అర్థమవుతుంది అన్నారు. ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న జగన్ తాను పనిచేయక అధికారులతో కూడా పనిచేయించలేదని, ఇటువంటి విపత్కర పరిస్థితిలో అప్పుడు వచ్చి ఉంటే కనీసం వంద రోజులు చేరుకోవడానికి సమయం పట్టేదన్నారు.

తన పాలనలో కేవలం అరాచకాన్నే ప్రోత్సహించిన జగన్, టిడిపి కార్యాలయం పై దాడి తానే ప్రోత్సహించానని జగన్ స్వయంగా ఒప్పుకున్నాడు అన్నారు. టిడిపి కార్యాలయం పై దాడిలో జగనే అసలు ముద్దాయి అన్న వీరు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే చట్టాన్ని గౌరవించాలని, కానీ జగన్ ఏ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకోలేదన్నారు.

…. ప్రజలను రక్షించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు…..

ఇటీవల వచ్చిన విపత్తు నుండి ప్రజల ప్రాణాలు రక్షించి పది రోజులు పాటు నిద్రాహారాలు లేకుండా కష్టపడి ప్రజల స్థితిగతులను యధాస్థితికి తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడుకి ఎన్టీఆర్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఎంపీ కేసినేని చిన్ని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రద్దు చేసిన పనుల్లో బుడమేరుకు సంబంధించిన ఐదు పనులు ఉన్నాయని, పనులు పూర్తి చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి విజయవాడకి వచ్చి ఉండేది కాదన్నారు. ఐదేళ్లపాటు జగన్ చేసిన పాపాలన్నీ ఇప్పుడు వెంటాడుతున్నాయి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement