ఒంగోలు క్రైం, జనవరి 8(ఆంధ్రప్రభ): గుడివాడ టిడిపి నేత, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు కామేపల్లి తులసి బాబు ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీఆర్ దామోదర్ బుధవారం అర్ధరాత్రి ప్రకటించారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు ఆయన బుధవారం హాజరయ్యారు.
బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఒంగోలు ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయనను జిల్లా ఎస్పీ అర్ధరాత్రి వరకు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. నేడు కామేపల్లి తులసి బాబును గుంటూరు కోర్టులో హాజరచనున్నారు..
- Advertisement -