Sunday, November 24, 2024

AP – 28న తాడేల్లిగూడెంలో టీడీపీ, జనసేనల బహిరంగ సభ

అమరావతి – రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగుతోన్న టీడీపీ, జనసేన పార్టీలు నేడు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.

ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలు, ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు ఈనెల 28న. తాడేల్లిగూడెంలో నిర్వహించనున్న బహిరంగ సభపై చర్చించారు. ప్రతీ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు విభేదాలు లేకుండా పనిచేసేలా సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఈనెల 28న జరిగే సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు

తెలుగుదేశం పార్టీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని, దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.. దాపరికం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. భాజపాతో మాట్లాడుతున్నాం.. పొత్తు గురించి త్వరలోనే ప్రకటన ఉంటుందన్నారు. తెదేపా- జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో 2 తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపారు. పొత్తును స్వాగతించిన తెదేపా-జనసేన కేడర్‌ను అభినందిస్తూ తీర్మానం చేశామన్నారు. మీడియాపై దాడులను తప్పు పడుతూ సమన్వయ కమిటీ రెండో తీర్మానం చేసిందన్నారు.

ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోందని, త్వరలో విడుదల చేస్తామని సమావేశం ముగిసిన తర్వాత అచ్చెన్న మీడియాకు తెలిపారు. ఏయే స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనేది చంద్రబాబు, పవన్‌ నిర్ణయం తీసుకుంటారన్నారు. పొత్తులు పెట్టుకొనే సమయంలో కొన్ని త్యాగాలు తప్పవని, టికెట్లు కోల్పోయిన వాళ్లు బాధపడొద్దని అధినేతలిద్దరూ చెప్పారని గుర్తు చేశారు. తెదేపా- జనసేన మధ్య గొడవలు పెట్టేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వాలంటీర్ల గురించి మాట్లాడిన మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు చేసినట్టు వివరించారు.

- Advertisement -

కలిసి పని చేసే సమయం ఆసన్నమైందని, విపక్షాల ఓటు చీలకూడదనే ఏకైక లక్ష్యంతో ఈ పొత్తు పెట్టుకుంటున్నామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. .అంతేకాదు, ఉమ్మడిగా బహిరంగ సభను నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 28వ తేదీన బహిరంగ సభ నిర్వహిస్తామని, 500 మంది ప్రత్యేక అతిథులు, ఆరు లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నట్టు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇక టికెట్లు, సీట్ల పంపకాల విషయంలో రెండు పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

Advertisement

తాజా వార్తలు

Advertisement