Wednesday, November 27, 2024

AP – స‌బ్సీడీ ధ‌ర‌ల‌కే బియ్యం, కంది ప‌ప్పు – తొలి స్టాల్ ను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల

విజ‌య‌వాడ – నిత్యావసర సరకులను రాయితీపై అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు రైతు బజార్లలో రాయితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా విజ‌య‌వాడ‌ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజార్లో తొలి కౌంటర్‌ను నేడు మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, పౌరసరఫరాలశాఖ, కృష్ణా జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా నాదెండ్ల మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ ఆదేశాలతో సామాన్యులకు నిత్యావసర సరకులను రాయితీపై అందిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా ప్రజల కష్టాలు తీర్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హోల్ సేల్‌ దుకాణదారులు, రిటైల్‌ వర్తకులు సైతం 160 రూపాయలకే నాణ్యమైన కిలో కందిపప్పు, తక్కువ ధరకే బియ్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే రోజుల్లో పంచదార సహా పలు చిరుధాన్యాలనూ రైతు బజార్ల ద్వారా రాయితీపై పంపిణీ చేస్తామని తెలిపారు. ఒక్కొక్కరికి కిలో కందిపప్పు, 5 కిలోల బియ్యం చొప్పున అందిస్తామని, ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

- Advertisement -

రేష‌న్ బియ్యం స్కామ్ లో అయిదుగురు ఐపిఎస్ లు

రేషన్‌ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉందని నాదెండ్ల మనోహర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్‌ బియ్యం సీజ్ చేశామని తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్లు త్వరలో చెల్లిస్తామన్నారు. ధరల స్థిరీకరణపై రిటైల్‌ వర్తకులతో మంత్రి సమీక్షించారు.

బంద‌రులో స్టాల్ ప్రారంభించిన మంత్రి కొల్లు

మచిలీపట్నం లోని రైతుబజారులో కందిపప్పు, బియ్యం స్టాల్ ను మంత్రి కొల్లు రవీంద్రగురువారం ప్రారంభించారు. సబ్సిడీ ధరలకు రైతు బజారులో బియ్యం, కందిపప్పును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు రైతుబజార్లలో రాయితీపై బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement