ఎన్ఎడి, ఆగష్టు 6(ప్రభ న్యూస్): జీవీఎంసీ 90 వార్డు బుచ్చిరాజుపాలెం గాయత్రి కళాశాల సీనియర్ జూనియర్ల మధ్య చెలరేగిన గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. సీనియర్ విద్యార్థిని జూనియర్ విద్యార్థి కొట్టాడని వాదుటలాగా మొదలయిన గొడవ పెద్దదయింది. సీనియర్ విద్యార్థి అన్న కలుగ జేసుకోవడంతో కొట్లాటకు దారితీసింది.
అటు సీనియర్లు ఇటు జూనియర్లు కలిసి గొడవ పడుతున్న సమయంలో బయట వ్యక్తులు కలుగచేసుకోవడం తో గొడవ పెద్దదయింది. పిడిగుద్దులతో ముష్టాఘాతాలతో ఇరువర్గాల వారు బాహాబాహీకి దిగారు. రోడ్డు మధ్యలో కొట్టుకుంటుంటే జనం గుమిగూడి చూస్తుండడంతో రోడ్డంతా వాహనాలతో జామ్ అయింది. ఇరుపక్కలా వాహనాలు నిలిచి పోయాయి .మొత్తం దొమ్మీగా మారిపోయింది.
కళాశాల సిబ్బంది ఆపుతున్న ఎవ్వరూ ఆగలేదు. సుమారు అరగంట వరకు ఈ కుమ్ములాట ఇలా సాగింది. స్థానికంగా ఉన్న వ్యక్తి 100 ఫోన్ చేయగా కొద్దిసేపటికి వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపి అన్నెపు నరసింహమూర్తి, ఎయిర్పోర్టు సీఐ చక్రధర్ రావు గోపాలపట్నం సీఐ సురేష్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరు రాకతో విద్యార్థులు యువకులు చెల్లాచెదురై య్యారు.
దీనిపై కళాశాల యాజమాన్యంతో విచారిస్తున్నారు. ఈ కోట్లాటలో సంబందమున్న విద్యార్హుల్ని వీడియో ఫుటేజ్ ఆధారంగా గుర్తించి వారి తల్లి దండ్రులను విద్యార్థులను కళాశాలకు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరో మారు ఈ విధంగా కొట్లాటలు జరగకుండా కళాశాల యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ సబ్ డివిజన్ స్టేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.