Tuesday, November 26, 2024

AP | తైక్వాండ్‌లో ఏపీ విద్యార్ధుల సత్తా..

అమరావతి, ఆంధ్రప్రభ: జాతీయ స్థాయి తైక్వాండ్‌ పోటీల్లో ఏపీ విద్యార్ధులు సత్తా చాటారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 67వ జాతీయ స్కూల్‌ గేమ్స్‌ ‘తైక్వాండో’ అండర్‌ – 14,17,19 బాల, బాలికల విభాగంలో డిసెంబరు 31 నుంచి ఈ నెల 5 వరకు మధ్య ప్రదేశ్‌లోని ‘బీటల్‌’లో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఏపీ విద్యార్ధులు ఉత్తమ ప్రతిభ కనబరిచి ఒక రజతం, మూడు కాంస్య పతకాలు దక్కించుకున్నారని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు తెలిపారు.

అండర్‌ 19 బాలికల (52-55 కేజీలు) విభాగంలో హస్తి తేజస్విని రజత పతకం, (46-49 కేజీలు) విభాగంలో వారణాసి హిమ కాంస్య పతకం, అండర్‌ 14 (16-18 కేజీలు) విభాగంలో ఆకుల సమీరా కాంస్య పతకం, అండర్‌ 17 బాలురు (73-78 కేజీలు) విభాగంలో పెదగాడి ధనుష్‌ తేజ, కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విద్యార్దులకు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement