Tuesday, November 19, 2024

AP – విద్యార్ధుల చేతుల్లోనే దేశ భ‌విష్య‌త్ – పవన్ కల్యాణ్

అన్ని రంగాల్లో రాణించాల‌ని ఆకాంక్ష‌
విద్య, క్రీడలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధన దిశగా అడుగులు
గొల్లప్రోలు బాలుర జెడ్పీ పాఠశాల విద్యార్ధులతో పవన్ ముఖాముఖి
స్కూల్‌లో సైన్స్ ల్యాబ్ ప్రారంభం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విద్య, క్రీడలు, శాస్త్ర మరియు సాంకేతిక రంగాల్లో ప్రగతి సాధన దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో భాగంగా గొల్లప్రోలులోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సంద‌ర్భంగా స్కూల్లో విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్ ని ప్రారంభించారు. అనంతరం 10వ తరగతి విద్యార్ధులతో ముఖాముఖిగా సంభాషించారు.

  • పిఠాపురం నియోజకవర్గానికి శాసన సభ్యుడిగా కాకుండా మీలో ఒకడిగా ఒక్క నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే చాలు అన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.
  • నేను చదువుకునే రోజుల్లో నాయకులు ఎలా ఉండాలి అని ఊహించుకున్నానో.. అలా నేను ఉండాల‌ని ప్రయత్నం చేస్తున్న.
  • విద్యార్ధులు ఎంత బాగా చదువుకుంటే దేశం అంత అభివృద్ధి చెందుతుంది.
  • పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగు నీరు, ఆట స్థలాలు బాగుంటే ఆహ్లాదకర వాతావరణంతో విద్యార్ధులు బాగా చదువుకుంటారు.
  • విద్యార్ధులకు చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం.
  • విజువల్ థింకింగ్ మీద దృష్టి సారించాలి. డ్రాయింగ్ స్కిల్స్ బాగుంటే చదివిన చదువు కూడా ఎక్కువగా గుర్తు ఉంటుంది.
  • ఉపాధ్యాయులు మైండ్ మ్యాపింగ్ మీద దృష్టి సారించాలి. అవసరం అయితే మైండ్ మ్యాపింగ్ మీద వర్క్ షాపు నిర్వహించాలి

కంప్యూటర్ ల్యాబ్‌ ఏర్పాటుకు హామీ
విద్యార్ధులతో ముఖాముఖీ సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ తరగతి గదిలోని ప్రతీ విద్యార్ధి పేరు అడిగి తెలుసుకుని కరచాలనం చేశారు. పాఠశాలకు ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలా అని ఆయ‌న అడిగారు. కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాల‌ని విద్యార్ధులు కోరారు. తక్షణం స్కూలు ప్రధాన ఉపాధ్యాయురాలిని పిలిచి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుకు ఎన్ని కంప్యూటర్లు కావాలని ఆరా తీశారు. త్వరలోనే పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ కంప్యూటర్ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement