గంజాయి స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చట్టాన్ని తీసుకువచ్చి ఈ ముప్పును అరికట్టాలని జనసేన అధినేత పవన్ కల్య్యాణ్ సూచించారు. గంజాయి స్మగ్లింగ్‌పై ఇటీవల తరచు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న ఆయన తాజాగా శుక్రవారం మరో ట్వీట్ చేశారు.
ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ సామాజిక , ఆర్థిక సమస్యగా చూడాలని పేర్కొన్నారు. గంజాయి స్మగ్లింగ్ సమస్య అకస్మాత్తుగా తలెత్తింది కాదని, ఇది 15, 20 ఏళ్లుగా ఉందన్నారు. ఈ అంశాన్ని తాను 2018 నుంచి హైలెట్ చేస్తున్నానని వెల్లడించారు. అయితే ప్రస్తుతం వైకాపా పాలనలో గంజాయి స్మగ్లింగ్ మరింత ఎక్కువైందని, వేల కోట్ల విలువైన గంజాయి వ్యాపారాన్ని అంతం చేసేందుకు పటిష్టమైన చట్టాన్ని తీసుకువచ్చి అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 2018లో తాను గంజాయిపై మాట్లాడిన వీడియోను పవన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.