అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ- ఇంజినీరింగ్ విద్యార్థులు వరల్డ్ టాప్ యూనివర్సిటీ-ల్లో తమ ప్రతిభను చాటారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఎంఎస్ చదివేందుకు 15 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంపికయ్యారు. 50లోపు క్యూఎస్ ర్యాంకులున్న యూనివర్సిటీ-ల్లో ఉపకార వేతనాలతో ఎంఎస్ చేసేందుకు వీరు అర్హత సాధించారు. ఇందులో నలుగురు విద్యార్థులు వరల్డ్ టాప్ -టె-న్ యూనివర్సిటీ-ల్లో ఎంఎస్ అడ్మిషన్లు సాధించడం విశేషం. ఈ సందర్భంగా సోమవారం ఏపీ ఎస్ఆర్ఎం వర్సిటీ-లో ఎంపి-కై-న విద్యార్థుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ-లో 2018-22 బ్యాచ్‌కి చెందిన పలువురు విద్యార్థులు వరల్డ్ టాప్యూనివర్సిటీ-ల్లో ఎంఎస్ చదివేందుకు ఆసక్తి చూపారు. వీరంతా ఎంపిక చేసుకున్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీ-ల్లో ఎంఎస్ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఐఈఎల్టిdఎస్, జీఆర్ఈ ఫలితాలతో పాటు- విద్యార్థులు బీ-టె-క్ చదివిన యూనివర్సిటీ- జీపీఏలను ప్రామాణికంగా తీసుకున్న యూకే, యూఎస్‌లలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ-లు అర్హత గల విద్యార్థులను ఎంఎస్ కోర్సుకు ఎంపిక చేశాయి.
ఎంపికైన విద్యార్ధుల్లో దాసరి జయరామ్ చౌదరి, బొర్రా లీలా సుజన్ సాయి, యోగేంద్ర గోపీనాథ్, గద్దె వెంకట ఫణి భూషణ్, కమ్మ సంహిత, కొవ్వూరి సత్యనారాయణరెడ్డి, పాలడుగు శిరివంత్, హరిహరన్, అబ్బాస్ జహంగీర్, నందం హకీష్ రాహిత్య, పులివరి జితేంద్ర కొంగని కసిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి, మాదల పూర్ణసాయి ఉన్నారు. వీరంతా న్యూయార్క్ యూనివర్సిటీ, జాన్సప్రిన్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ చికాగో, యూనివర్సిటీ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, కార్నెల్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్లలో ఎంఎస్ అడ్మిషన్లు పొందారు. వీరికి ఆయా యూనివర్సిటీ-లు ఏడాదికి 20 వేల యూఎస్ డాలర్ల వరకూ ఉపకార వేతనాలను ప్రకటించింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ- సైతం వీరందరికీ రూ. 50 లక్షల స్కాలర్ షిప్ ప్రకటించింది. ఒకే యూనివర్సిటీ- నుంచి ఇంత పెద్దమొత్తంలో విద్యార్థులు ఎంఎస్ ఆడ్మిషన్లు దక్కించుకోవడం ఇదే ప్రథమమని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ- పేర్కొంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ- ఆడిటోరియంలో ఏర్పాటు- చేసిన టాలెంట్ బాక్ కార్యక్రమంలో యూనివర్సిటీ- వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వజ్జా సాంబశివరావు, రిజిస్ట్రార్ డా. ఆర్ ప్రేమకుమార్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ నాగశ్వేత తదితరులు విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.