Sunday, November 17, 2024

AP: పంట విక్ర‌యానికి ప్రత్యేక యాప్‌.. సీమలో ప‌ల్లి, మ‌క్క‌ల కొనుగోలుకు స‌న్న‌ద్ధం..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వైసీపీ అధికారం లోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అన్నదాతల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి ప్రత్యేక యాప్‌ ను రూపకల్పన చేసింది. ఇప్పటివరకు చేతికి వచ్చిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు.

మార్కెటింగ్‌ వ్యవస్థలో దళారుల ప్రమేయం తీవ్రంగా నష్ట పరుస్తోంది. దీనిని నిర్మూలించేందుకు ‘ఈ-ఫామ్‌ మార్కెట్‌ యాప్‌’ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వ్యవసాయ శాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలో ప్రయోగాత్మ కంగా పంట దిగుబడులు కొనుగోళ్లు చేస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తుల చిత్రాలు ‘ఈ-ఫామ్‌’ మార్కెట్‌ యార్డులో పొందుపరచాలి. ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రైతులు, వ్యాపారులకు అనుసంధా నకర్తగా ఉంటుది.

ఈ విధానం తీసుకొస్తే క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలు తెలుసుకొనేందుకు జిల్లాలో 20 రోజులుగా ప్రయోగాత్మకంగా కొనుగోళ్లు చేపట్టారు. ఎమ్మిగనూరు మార్కెటు- పరిధిలో రూ.30 లక్షల విలువైన వేరుసెనగ, నంద్యాల ప్రాంతంలో 50 టన్నుల మొక్కజొన్న కొన్నారు. ఈ-ఫామ్‌ మార్కెట్‌ యాప్‌ రూపకల్పనలో భాగంగా ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కొంటు-న్నారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లో ప్రక్రియ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement