Friday, November 22, 2024

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని వేటాడాలిః స్పీకర్ తమ్మినేని

మహిళలపై అత్యాచారాలు చేసే వారిని భూమిపై లేకుండా చేయాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. పురుషుల ఆలోచనా ధోరణి మారాలన్నారు. సొసైటీలో నైతికత లేకుండా పోతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే చట్టాలను పక్కనపెట్టి నిందితులను వేటాడాలన్నారు. శ్రీకాకుళంలో దిశ యాప్‌కు సంబంధించిన అవగాహన కార్యక్రమంలో తమ్మినేని ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణలో దిశపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి హతమార్చిన దోషులను వేటాడారంటూ సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను అభినందించారు స్పీకర్ తమ్మినేని. మగాడు అనే వ్యక్తి సమాజానికి ప్రొటక్షన్ ఇవ్వాలి కానీ మృగంలా మారకూడదన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై ఔటాఫ్ లా వెళ్లైనా సరే శిక్షించాలన్నారు. కన్నతండ్రులు పసిపిల్లలను అమానుషంగా చెరబడుతున్నారంటూ ఎమోషనల్ అయ్యారు తమ్మినేని.

ఇది కూడా చదవండిః కొండచరియలు విరిగిపడి 36 మంది మృతి

Advertisement

తాజా వార్తలు

Advertisement