Friday, September 20, 2024

APలో సరికొత్త ప్రయోగం …. స్కిల్​..సెన్సెస్!​

దేశంలో మొదటిసారి ఇక్కడే
ప్రయోగం చేస్తున్న ఏపీ మంత్రి లోకేష్
ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యం
కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చడమే ధ్యేయం
ప్రముఖ కంపెనీలతో శిక్షణ, సర్టిఫికెట్​ అందజేత
రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఉద్యోగాలకు చాన్స్
ప్రముఖ పోర్టల్స్​ ద్వారా ఉన్నత ఉద్యోగాలు
ప్రక్రియను స్పీడప్​ చేసిన మంత్రి లోకేష్​​​

ఆంధ్రప్రభ స్మార్ట్​, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కిల్ సెన్సెస్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశంలోనే మొదటిసారిగా ఈ ప్రయోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నైపుణ్య గణనకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై చర్చించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో ఇప్పటికే మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఇప్పటివరకు దీనికోసం జరిగిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. స్కిల్ సెన్సెస్ ప్రక్రియ గురించి వివరించారు.

- Advertisement -

ఆన్‌లైన్ ద్వారా డిటెయిల్స్ సేక‌ర‌ణ‌

నిర్దేశిత సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించడంతో పాటు ఆన్​లైన్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్న యువత కూడా వివరాలు అందించే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇలా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వివరాలు సేకరించి వారి నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలా యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందడం ద్వారా వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని లోకేష్ పేర్కొన్నారు. ఇదే స్కిల్ సెన్సెస్ ముఖ్య ఉద్దేశమని అన్నారు.

ప్ర‌ముఖ కంపెనీల్లో అవ‌కాశాలు..

స్కిల్ సెన్సెస్​లో భాగంగా యువతకు ఏ రంగంలో నైపుణ్యం ఉందో గుర్తిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. అనంతరం స్కిల్ డెవలప్​మెంట్​లో భాగంగా ముఖ్యమైన సంస్థలతో శిక్షణతో పాటు సర్టిఫికేట్ కూడా అందిస్తామన్నారు. ఇలా ఆయా రంగాల్లో యువతకు ఉపాధి అందేలా చూస్తామన్నారు. రాష్ట్రంలోని పరిశ్రమలతోపాటు naukri.com, LinkedIn వంటి పోర్టల్స్ ద్వారా మెరుగైన అవకాశాలను పొందే చాన్స్​ ఉంటుందని లోకేష్​ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement