గుంటూరు – ఉమ్మడి గుంటూరు జిల్లాలో తండ్రి డబ్బు కోసం సొంత సోదరులనే ఓ సోదరి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే పల్నాడులోని నకరికల్లు యానాది కాలనీలో కృష్ణవేణి ఉంటున్న ఈమెకు ఇద్దరు సోదరులు ఉన్నారు. అయితే కృష్ణవేణికి పెళ్లి అయ్యింది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల భర్తతో విడిపోయి సోదరుల ఇంట్లోనే ఉంటుంది. వారి తండ్రి ప్రభుత్వ ఉద్యోగస్తుడు. పక్షవాతంతో మరణించడంతో ప్రభుత్వం నుంచి డబ్బులు కోసం ముగ్గురి మధ్య రోజూ తగాదాలు జరుగుతున్నాయి.
అనారోగ్యంతో ఉన్నప్పుడు కృష్ణవేణి చూసుకుందని, ఆ డబ్బులు తనకే చెందాలనుకుంది. ఈ విషయంలో సోదరులు విభేదించడంతో ఇద్దరు అన్నలను కూడా కృష్ణవేణి హత్య చేసింది. పెద్ద అన్నకు ఎక్కువగా మద్యం సేవించి చున్నీ మెడకు బిగించి హత్య చేసింది. చిన్న అన్నను కాలువలో తోసేసి హత్య చేసింది. పెద్ద అన్న ప్రభుత్వ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి డ్యూటీకి వెళ్లకపోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెంటనే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.