Tuesday, November 19, 2024

AP – ఘనంగా షర్మిల తనయుడి వివాహం

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం జోథ్ పూర్ లో నేడు జరిగింది ఈ నేపథ్యంలో . షర్మిల తన కుమారుడి హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్ రాజా-ప్రియా అంటూ ట్వీట్ చేశారు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అంటూ దీవించారు.

ఈ వేడుకల్లో షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, షర్మిల కుమార్తె అంజలి రెడ్డి, వైఎస్ విజయమ్మ, ప్రియా అట్లూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం జనవరి 18న హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్ లో ఘనంగా జరిగింది. కాగా, వీరి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ఈ నెల 16 నుంచి మూడ్రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. నేడు వివాహం జరగగా రేపు విందు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement