Wednesday, November 20, 2024

AP – ‘అన్న’ నిర్వాహ‌కంతోనే విజ‌య‌వాడ‌కు ఈ దుస్థితి – జ‌గ‌న్ పై విరుచుకుప‌డ్డ షర్మిల‌


నిర్వ‌హ‌ణ‌కు నిధుల కూడా విడుద‌ల చేయ‌ని ఘ‌నుడు
ఆయ‌న ప‌ద‌విలో ఉండ‌గానే ప‌లు ప్రాజెక్ట్ ల‌లో ప్ర‌మాదాలు
ప్ర‌కాశం బ్యారేజ్ గేట్లు విర‌గ‌డంపై అనుమానాలు
స‌మ‌గ్ర ద‌ర్యాపు చేయాల‌ని చంద్ర‌బాబుకు విన‌తి
దోషులను గుర్తిస్తే క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ ..

విజ‌య‌వాడ -గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, బ్యారేజీలకు వార్షిక నిర్వహణ కూడా చేపట్టలేదని ఎపి పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. కనీసం రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను సైతం గత జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. విజ‌య‌వాడ ప్రకాశం బ్యారేజీ పై విరిగిన గేట్ల‌ను నేడు ఆమె పరిశీలించారు.ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ జ‌గ‌న్ అన్న నిర్వాకంతోనే విజ‌య‌వాడ‌కు ఈ దుస్థితి ఏర్ప‌డింటూ మండిప‌డ్డారు..నిర్వ‌హ‌ణ‌కు నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతోనే ప‌లు ప్రాజెక్టుల గేట్లు సైతం ఊడి.. నదులో తెలియాడాయని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులకు వార్షిక నిర్వహాణ చేపట్టేలా సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టాలన్నారు.

- Advertisement -

బాధ్యుల‌ను గుర్తించండి… క‌ఠినంగా శిక్షించండి.

కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజీ గేట్లు విరిగిపోయిన ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కావాలనే పడవలను వదిలారా? అని సందేహం వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులు ఎవరో గుర్తించి.. వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రకాశం బ్యారేజీకి ఎంతో ఘన చరిత్ర ఉందని గుర్తు చేశారు. అలాంటి బ్యారేజీ గేట్లు విరిగి పోయిన అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించకుంటే.. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు చోటు చేసుకునే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రకాశం బ్యారేజీ మరమ్మతు పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement