Sunday, November 17, 2024

AP Secretariat: కరోనా ఆంక్షల ఎత్తివేత

ఏపీలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌తంలో వేల సంఖ్య‌లో న‌మోదైన క‌రోనా కేసులు ప్ర‌స్తుతం వంద‌ల సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో క‌రోనా ఆంక్ష‌లు ఎత్తివేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రబలంగా ఉన్న సమయంలో ఏపీ సచివాలయ సిబ్బంది కార్యాలయానికి హాజరుకావడంపై సర్కారు ఆంక్షలు విధించడం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో సచివాలయంలో కరోనా ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని శాఖల కార్యదర్శులు కార్యాలయానికి రావాలని ఆదేశించింది. ఇకపై సచివాలయం నుంచే విధులు నిర్వర్తించాలని సీఎస్ సమీర్ శర్మ స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారులు కూడా బయోమెట్రిక్ విధానం పాటించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సమావేశాలకు కూడా భౌతికంగా హాజరు కావాలని ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement