Saturday, November 23, 2024

AP – రైల్వే ప్రాజెక్టులకు మోక్షం – రేపు జాతికి అంకితం చేయనున్న ప్రధాని



అమరావతి, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా రూ. 85,000 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టులను ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 12న జాతికి అంకితం చేయనున్నారని, వర్చువల్‌ ద్వారా పలు రైళ్లను జెండా ఊపి ప్రారంభిస్తారని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జనరల్ మేనేజర్‌ అరుణ్ కుమార్ జైన్ చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 133 ఓఎస్‌ఓపీ స్టాల్స్‌, 3 గతి శక్తి -టె-ర్మినల్స్‌, 7 గూడ్‌షెడ్‌లు, 1 జన ఔషధి కేంద్రం, 2 రైల్‌ కోచ్‌ రెస్టారెంట్‌లు, 12 విభాగాలు డబ్లింగ్‌/ మూడోలైన్‌, బైపాస్‌ ప్రాజెక్ట్‌లు, సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య 2వ వందే భారత్‌ను జాతికి అంకితం చేయనున్నట్లు తెలిపారు.

విజయవాడ బైపాస్​ లైన్​..

భారతీయ రైల్వేలు వాటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి నిబద్ధతతో ఉన్నాయని అన్నారు. విజయవాడ డివిజన్‌ పరిధిలోని తణుకు, బిక్కవోలు, ఏలూరులో అప్‌గ్రేడ్‌ చేసిన 3 గూడ్‌షెడ్లు, గూడూరు-బిట్రగుంట మూడో లైన్‌తో పాటు- 67 ఓఎస్‌ఓపీ స్టాల్స్‌, బిట్రగుంట-కరవాడి-చీరాల మూడో లైన్‌, విజయవాడ బైపాస్‌ లైన్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. రైల్‌ లైన్‌ ప్రాజెక్ట్‌ ప్రాజెక్ట్‌ వ్యయం రూ.3246 కోట్లని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య 2వ వందే భారత్‌ను ప్రవేశపెట్టడం అత్యంత ప్రాముఖ్యమని తెలిపారు. ఆక్యుపెన్సీ రేటు 120 కంటే ఎక్కువగా ఉం టోందని, తగ్గిన ప్రయాణ సమయం, సమయపాలన, అనుకూలత వంటి అంశాల కారణంగా యువత ముఖ్యంగా టెక్కీలు వందేభారత్‌ ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

విజయవాడ డివిజన్లో నాలుగో వందేభారత్​

కొత్తగా ప్రవేశపెట్టి న వందే భారత్‌ రైలు విజయవాడ డివిజన్‌లో నాలుగోదని తెలిపారు. విశాఖపట్నం-విజయవాడ-సికింద్రాబాద్‌ సెక్షన్‌లోని అత్యంత రద్దీగా ఉండే సెక్షన్‌లో ప్రయాణికులకు ఇది అత్యంత ఉపయోగకరంగా ఉండనుంది. దేశమంతటా సరుకు రవాణా కార్యకలాపాలను ప్రోత్సహించే లక్ష్యంతో భారతీయ రైల్వేలో గూడ్స్‌షెడ్‌ల పెంపుదల అవశ్యకతను గుర్తించినట్లు డీఆర్‌ఎం తెలిపారు. విజయవాడ డివిజన్‌లో 15 గుడ్‌షెడ్‌ల అప్‌గ్రేడేషన్‌ కోసం ఇటీ-వల రైల్వే మంత్రిత్వ శాఖ రూ.150 కోట్లకు ఆమోదం తెలిపిందన్నారు. తాడేపల్లిగూడెం, బయ్యారం, బిక్కవోలు, ద్వారపూడి, పడుగుపాడు, సామర్లకోట, కృష్ణా కెనాల్‌, ఏలూరు, గుడివాడ, తెనాలి, నిడదవోలు, పాలకొల్లు, ఆకివీడు, తణుకు త దితర చోట్ల ఈ గూడ్‌షెడ్లు పెంచినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement