Saturday, September 21, 2024

తొలి రోజు 50% విద్యార్థులు హాజరు..

కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ అనంతరం నిన్న ఏపీలో పాఠశాలలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. అయితే తొలి రోజు పాఠశాలలకు 50 శాతం మంది విద్యార్థులు హజారయినట్లు తెలుస్తోంది. కరోనా భయం వెంటాడుతుండడంతో తమ పిల్లలను స్కూళ్లకు పంపడానికి తల్లిదండ్రులు వెనుకంజవేస్తున్నారు. దీంతో తొలిరోజు హాజరు తగ్గింది. ఆయా స్కూళ్ల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మాస్కులు ధరించి హాజరయ్యారు. పాఠశాల తరగతి గదులలో భౌతిక దూరం పాటిస్తుండడం వల్ల విద్యార్థులకు సరిపడా రూములు లేక, కొన్ని చోట్ల షిఫ్టుల వారీగా క్లాసులు నిర్వహించినట్టు తెలుస్తోంది. కరోనా భయం పూర్తిగా తొలగిపోకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్ కి పంపించాలంటే జంకుతున్న పరిస్థితి ఏర్పడింది.

ఇది కూడా చదవండి: వీడియో: కాబూల్ ఎయిర్‌పోర్టులో ఇది పరిస్థితి..

Advertisement

తాజా వార్తలు

Advertisement