Friday, September 20, 2024

AP స్వచ్ఛంద సేవా సంస్థల సేవలు భేష్ : మంత్రి సవిత

అమరావతి : వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకొస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల సేవలను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత కొనియాడారు. బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విజయవాడ రౌండ్ టేబుల్, అమరావతి రౌండ్ టేబుల్ స్వచ్ఛంద సేవా సంస్థలు వరద బాధితులకు అందజేసే బట్టల కిట్ ను మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, వరద బాధితులను ఆదుకోవడంలో స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం సాయమందిస్తుంటే… మరో వైపు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా తమవంతు సాయమందిస్తూ వరద బాధితులకు అండగా ఉంటున్నాయన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయమందించే చేతులు మిన్న అనే నానుడిని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు నిజం చేస్తున్నారని కొనియాడారు.

- Advertisement -

వరద బాధితులకు సాయమందించడానికి మరిన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం విజయవాడ రౌండ్ టేబుల్, అమరావతి రౌండ్ టేబుల్ స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న బట్టల కిట్ ను మంత్రి ఆవిష్కరించారు. ఒక్కో కిట్ లో రూ.1500ల విలువ చేసే చీర, నైటీ, బెడ్ షీట్, లుంగీ, తువ్వాలు ఉన్నాయని ఆ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తెలిపారు.

ఇలా వెయ్యి మందికి రూ.15 లక్షల విలువ చేసే దుస్తులు పంపిణీ చేయనున్నట్లు మంత్రికి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అమరావతి రౌండ్ టేబుల్ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ అశ్విన్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement