త్వరలో పవన్ కళ్యాణ్ తో భేటీ..
రేపు కార్యకర్తలతో ప్రత్యేక భేటీ..
ఈ నెల 22న జనసేనలో చేరిక….
వైసిపి ఆవిర్భావం నుండి జగన్ కి తోడుగా…
ఎన్టీఆర్ జిల్లాకు పెద్దదిక్కుగా…
నాటి రాజశేఖర్ రెడ్డి నుండి నేటి జగన్ తో రాజకీయ అడుగులు…
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం…
మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ప్రభుత్వ విప్ గా అనుభవం…
కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా..
సోషల్ మీడియా వేదిక స్వాగతిస్తున్న జనసైనికులు..
(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో ) సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. మునిపన్నడు ఊహించని విధంగా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభిజయం పాలై 11 చెట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లభించలేని స్థితిలో ఉంది. భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళనలో ఉన్న నాయకులు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూ వస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుల సైతం పార్టీ మారే ఆలోచనలో ఉంటూ అధికార తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ వైపు వెళ్తున్నారు.
మొన్నటి వరకు కొంతమంది నేతలు జనసేన టిడిపిలోకి చేరగా, నిన్న సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజ్యాంగం చేయగా, తాజాగా బుధవారం మరో సీనియర్ నేత సామినేని ఉదయభాను వైసీపీ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత మాజీ విప్ సామినేని ఉదయభాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందే ఆయన జన సేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి ఆయనను వెల్లనీయకుండా నిలువరించారు. అయితే సార్వత్రిక ఎన్నికల ద్వారా పరాజ్యం తర్వాత జనసేనలోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు మళ్ళీ ప్రారంభించారు.
గడచిన కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్న ఉదయభాను ఈనెల 22వ తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఈనెల 23వ తేదీన జగ్గయ్యపేట నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు శ్రేణులతో శుభమస్తు కళ్యాణమండపంలో ఆయన ప్రత్యేక సమావేశాన్ని సైతం ఏర్పాటు చేశారు. సమావేశంలో తాను తీసుకున్న నిర్ణయాన్ని నాయకులకు కార్యకర్తలకు శ్రేణులకు అభిమానులకు వివరించనున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, అపార ప్రజాభిమానం, జిల్లాపై మంచి పొట్టు ఉన్న సామినేని ఉదయభాను నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం కాక ముందు నుండే ఆయనతో రాజకీయ అడుగులు వేస్తూ వచ్చారు.
జగన్ పార్టీ ప్రారంభించిన నాటినుండి వ్యవస్థాపకుడిలో ఒకడిగా ఉన్న సామినేని ఉదయభాను ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీని పూర్తిస్థాయిలో బలోపేతం చేయడంలో దశాబ్దం పాటు ఎంతో కృషి చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు విప్ గా పనిచేసిన అనుభవం ఉన్న సామినేని ఉదయభాను టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో వైసిపి నేక్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో విశేష కృషి చేసిన సామినేని ఉదయభాను నువ్వు అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తానని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన హామీ సైతం ఇచ్చారు. 19 ఎన్నికల తర్వాత హామీని నిలబెట్టుకోలేని జగన్ తీరుతో అప్పట్లోనే ఆయన కన్నీటిపర్యంతమైన సందర్భాలు వెలుగులోకి వచ్చాయి.
పార్టీ ఆవిర్భావం నుండి ఉన్న తనకు సరైన, సముచిత స్థానం ఇవ్వలేదన్న భావన ఉదయభాను లో ఎప్పటినుండో ఉంటూ వచ్చింది. ఇదే విషయాన్ని పలుమార్లు ఆయన అంతరింగికులు, నాయకులు,కార్యకర్తల దగ్గర కూడా ప్రస్తావించారు. ఎన్టీఆర్ జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న సామినేని ఉదయభాను కు తగిన న్యాయం జరగలేదన్న భావన సర్వత్రా ఉంది. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ మనుగడ కష్టమని భావిస్తున్న ఉదయభాను జనసేన పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గడచిన కొన్ని రోజులుగా ఉదయభాను పార్టీ మార్పుపై సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్న నేపథ్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని జన సైనికులు ఆయన రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పోస్టులు సైతం పెడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ నీ సీనియర్లంతా ఒకరి తర్వాత ఒకరు వీడుతుండడంతో ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల్లో కార్యకర్తల్లో తీవ్ర అలజడి నెలకొంది.
జనసేన జిల్లా అధ్యక్ష బాధ్యతలు..
వైసిపి పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతున్న మాజీ విప్ సామినేని ఉదయభాను కు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చూసిన పోతిన మహేష్ వైసీపీకి వెళ్లిన నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఎవరిని నియమించలేదు. ప్రస్తుతం సీనియర్ రాజకీయ నాయకుడుగా ఉన్న సామినేని ఉదయభాను కు జిల్లా పై మంచి పట్టు ఉన్న నేపథ్యంలో ఆయనకు జిల్లా జనసేన పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.