తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చూస్తే జాలేస్తోందన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా?. అలాగే, ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని సజ్జల కామెంట్స్ చేశారు. నేడు విడుదలైన టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాపై సజ్జల స్పందించారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పొలిటికల్ పార్టీ నడిపే లక్షణాలు పవన్‌కు లేవని. అత్యంత దయనీయ స్థితిలో ఆయన ఉన్నారన్నారు.
ఎన్నో ప్రగల్బాలు పలికిన పవన్ ఇప్పుడు ఎందుకు దిగజారిపోయారన్నారు. జనసేనను మింగేసి ప్రయోజనం పొందాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు సజ్జల. టీడీపీ, జనసేనవి దింపుడు కళ్లెం ఆశలని. ఆశించిన సీట్లు రావనే చంద్రబాబు డ్రామాలాడుతున్నారన్నారు. జనసేన మిగిలిన స్థానాల్లోనూ చంద్రబాబు తన అభ్యర్థులను పంపుతారని జ్యోస్యం చెప్పారు.. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేసినా తమకు ఇబ్బంది లేదని. వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీదే ఘన విజయం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు..
ఇకనైనా పవన్‌ను అభిమానించే వారంతా ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు సజ్జల. 175 స్థానాల్లో నిలబెట్టేందుకు టీడీపీకి అభ్యర్థులే లేరని అంటూ పవన్ టీడీపీ ఉపాధ్యాక్షుడి పదవి తీసుకుంటే బాగుంటుందని సెటైర్ వేశారు. 24 మందితో వైఎస్సార్‌సీపీ మీద పవన్ యుద్ధం చేస్తారా? అన్ని ప్రశ్నించిన సజ్జల కనీసం 24 స్థానాల్లో పూర్తిగా అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో పవన్ ఉన్నారంటూ ఫైర్ అయ్యారు.