Monday, January 20, 2025

AP | రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ వాసుల మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ వాసులు మృతిచెందారు. తిరుపతిలోని రేణిగుంట సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

హైదరాబాద్ కు చెందిన సందీప్, అంజలీదేవి దంపతులు తిరుపతి నుంచి వస్తుండగా.. రేణిగుంట సమీపంలోని కుక్కలదొడ్డి వద్ద వీరి కారును ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిరువురు అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement