Friday, November 22, 2024

AP వరద బాధితులకు రిలయన్స్ రూ. 20 కోట్లు విరాళం

అమరావతి – ఏపీ వరద బాధితులను ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందించింది. ముఖ్యమంత్రి సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ ఈ భారీ విరాళం ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బోర్డు సభ్యులు పిఎంఎస్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మెంటార్ పివిఎల్ మాధవరావు నేడు కలిసి రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ తరపున రూ.20 కోట్ల చెక్‌ను అందజేశారు.

అటు తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి కూడా రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్లు విరాళంగా అందించింది.

- Advertisement -

శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నీతా అంబానీ తరపున చెక్‌ను రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అందించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & బోర్డు సభ్యుడు పిఎంఎస్ ప్రసాద్, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన మెంటార్-రిలయన్స్ గ్రూప్ పివిఎల్ మాధవరావు కలిసి సీఎం రేవంత్ రెడ్డికి రూ.20 కోట్ల చెక్కును అందించారు.

ఇలా రెండు రాష్ట్రాల్లో మొన్నటి అతి భారీ వర్షాలు, వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఇంత భారీగా విరాళం ఇవ్వడం అనేది గొప్ప విషయమే. చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు, సంస్థలు, వ్యక్తులు, విద్యార్థులు కూడా విరాళాలు ఇచ్చారు.

కొంతమంది విద్యార్థులు తమ కిడ్డీ బ్యాంక్ నుంచి మనీ ఇచ్చారు. మరికొందరు తమ ఆస్తులు అమ్ముకొని మనీ ఇచ్చారు. ఇంకొందరు నగలు అమ్మి మరీ విరాళం ఇచ్చారు. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. మంచి మనసున్న వారంతా వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చి.. కష్టసమయాల్లో అండగా, తోడుగా మేమున్నామని భరోసా, ధైర్యం ఇచ్చారు. భవిష్యత్తును పాజిటివ్‌గా చూసేలా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement