Thursday, November 21, 2024

వ్యాక్సినేషన్‌లో ఏపీ రికార్డ్.. దేశంలోనే 3వ స్థానం..

రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్‌ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. టీకా పంపిణీలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి విడత డోసు పంపిణీ పూర్తి చేయడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలవడం విశేషం. తొలి స్థానంలో కేరళ, రెండో స్థానంలో తెలంగాణ ఉన్నాయి. 96.98 శాతంతో మొదటి స్థానంలో, తెలంగాణ 96.01 శాతంతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక ఆంద్రప్రదేశ్‌ 95.98 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభమైంది.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 6 కోట్ల 54 లక్షల 90 వేల 708 టీకా డోసులను పంపిణీ చేయడం జరిగింది. కేంద్ర గణాంకాల ప్రకారం 18 సంవత్సరాలు దాటిన వారు రాష్ట్రంలో 3,95,22,000 మంది ఉన్నారు. వీరిలో 3,83,06,074 మందికి తొలివిడత టీకా వేశారు. అలాగే మలివిడత టీకా పంపిణీలో గుజరాత్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్రు ఆంద్రప్రదేశ్‌ కన్నా ముందంజలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 2,71,84,634 మందికి రెండు డోసులు పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రక్రియలో రాష్ట్రం దేశంలోనే ఐదవ స్థానంలో కొనసాగుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement