Thursday, November 21, 2024

AP – చిక్కిన గోల్డ్ ఫిష్​ – రెండు చేపల ధర రూ.4లక్షలే

ఫిషర్​మాన్​ జాక్​పాట్​
అంతర్వేది మినీ హార్బర్లో సందడి
ఈ చేపతో ఔషధ తయారీ..
శస్ర్త చికిత్సల్లోనూ కీలకం

ఆంధ్రప్రభ స్మార్ట్, అంతర్వేది ప్రతినిధి – ఓ మత్స్యకారుడు సముద్రంలో చేపల వేలకు వెళ్లాడు. అలా వెళ్లిన సదరు మత్స్య కారుడికి లక్ కలిసొచ్చింది. అంతే రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. అంతర్వేది సాగర తీరంలో ఓ మత్స్యకారుడికి గోల్డెన్​ చాన్స్ దక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుడి వలకు చేపలు చిక్కాయి. ఈ సారి వల లాగుతుంటే బరువు ఎక్కువనిపించింది. సరే తన పంట పండిందని సహచర జాలర్లతో కలిసి వలను లాగాడు. అంతే ఆశ్చర్యం. ఆ జాలరి ఇంట నిజంగానే బంగారం పండింది. తీరా వలలో రెండు భారీ కిచిడీ చేపలు చిక్కాయి.

జాలరికి జాక్పాట్

వలలో చిక్కిన కిచిడీ చేపల్ని (గోల్డెన్ ఫిష్) ఆ మత్స్యకారుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో వేలం వేయగా ఓ వ్యాపారి రూ.4 లక్షలకు కొనుగోలు చేశారు. దీంతో ఆ మత్స్యకారుడు ఆనందంలో మునిగి తేలుతున్నాడు. తనకు లభించిన ఈ జాక్పాట్తో తన కుటుంబం ఆర్థిక బాధలు తీరిపోతాయని హర్షం వ్యక్తం చేశాడు.

- Advertisement -

ఔషధాల తయారీలో

ఈ కిచిడి చేపను గోల్డెన్ ఫిష్‌ అని పిలుస్తారు. మగ కచిడి చేప ఉదరభాగంలో ఔషధ గుణాలు ఉంటాయి. మరికొన్ని ఔషధాల తయారీలో కూడా ఈ చేప శరీరభాగాల్ని ఉపయోగిస్తారు. మరొక్కమాటలో చెప్పాలంటే ఫార్మా ఇండస్ట్రీలో ఇదొక హాట్‌ కేక్‌. అందుకే ఈ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్. వ్యాపారులు దీన్ని దక్కించుకునేందుకు పోటీ పడతారు.శస్త్ర చికిత్స తర్వాత డాక్టర్లు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారు. చేప పొట్టభాగం నుంచి తయారుచేసే ఈ దారం సమయం గడిచే కొద్దీ శరీరంలో విలీనమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement