Thursday, December 26, 2024

AP -ఏజేన్సీలో మావోల కార్యకలపాలపై దృష్టిసారించాలి – విశాఖ రేంజ్‌ డీఐజీ గోపినాధ్‌ జట్టి

చింతూరు, , (ప్రభన్యూస్‌): చింతూరు మన్యంలో గంజాయి రవాణాను పూర్తిగా అరికట్టడంతో పాటు గంజాయి సాగు ఏక్కడైనా ఉంటే గంజాయి సాగును సైతం ధ్వంసం చేయాలని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపినాధ్‌ జట్టి అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మన్యంలో విశాఖ రేంజ్‌ డీఐజీ బుధవారం పర్యటించారు. ఈ పర్యటనలో ముందుగా చింతూరు పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని చింతూరు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. చింతూరు పర్యటనకు వచ్చిన డీఐజీకి చింతూరు ఏఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా పుష్పగుచ్చం స్వాగతం పలికారు.

పోలీస్‌స్టేషన్ల తనిఖీల్లో భాగంగా చింతూరు సర్కిల్‌ పరిధిలో చింతూరు పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేపట్టి రికార్డులను పరీశీలించారు. కేసుల నమోదు, రికార్డు నిర్వహాణ, పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది, పోలీసుల పనితీరును ఆయన పరీశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులకు అనేక సూచనలు చేశారు. చింతూరు నాల్గు రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్నందున వాహన తనిఖీలు విస్కృతంగా చేపట్టాలని సూచించారు.

- Advertisement -

గంజాయి రవాణాను అరికట్టుటకు ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేసుకోవడంతో పాటు డైనమిక్‌ వాహన తనిఖీలు చేపట్టాలన్నారు. మన్యం ప్రాంతంలో మావోయిస్టు కార్యకలపాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఏజేన్సీలోని మారుమూల గ్రామాల్లో కమ్యూనిటీ పోలిసింగ్‌, ఆత్మీయ సమ్మెళానాలను నిర్వహించాలన్నారు.

పల్లేల్లోని గిరిజనులతో మమేకమవ్వాలన్నారు. గంజాయి, మావోయిస్టుల సమాచారాన్ని మెరుగుపరుకోవాలని సూచించారు. ప్రజలతో పోలీసులు స్నేహాపూర్వకంగా మెసులుకోవాలన్నారు. అనంతరం ఆయన చింతూరు సబ్‌ డివిజన్లోని పోలీస్‌స్టేషన్లను సందర్శించి పరీశీలించారు. పోలీస్‌స్టేషన్ల సందర్శనలో భాగంగా సర్కిల్‌ కార్యాలయాల, పోలీస్‌స్టేషన్ల ఆవరణలను ఆయన పరీశీలించారు.

మన్యం పర్యటనకు విచ్చేసిన ఆయన తెలంగాణ రాష్ట్రం భద్రాధ్రి కోత్తగూడెం జిల్లా భద్రాచల రాములువారిని దర్శించుకొని రామాలయంలో ప్రత్యేక పూజాలు నిర్వహించారు. రామాలయ అర్చకులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించాఅరు. ఈ కార్యక్రమంలో చింతూరు సీఐ దుర్గా ప్రసాద్‌, ఎస్సై పేరూరి రమేష్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement