శ్రీ సత్యసాయి బ్యూరో (ఆంధ్రప్రభ): శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ రైల్వే స్టేషన్ యార్డ్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జిను కేంద్ర రైల్వే , జల శక్తి సహాయ మంత్రి వి. సోమన్న ఆదివారం జాతికి అంకితం చేశారు
.కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బి.కె.పార్థసారథి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సవితమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, పుట్టపర్తి శాసనసభ్యురాలు , పల్లె సింధూర రెడ్డి, జిల్లా కలెక్టర్ టీ.ఎస్. చేతన్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి , చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రైల్వే అజయ్ శర్మ, అమితేష్ కుమార్ , బెంగళూరు డివిజనల్ రైల్వే మేనేజర్, అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ , వివిధ రైల్వే విభాగాలకు చెందిన అధికారులు, కూటమి నాయకులు, రైల్వే ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.