అమరావతి, ఆంధ్రప్రభ : వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తమ విధులను సక్రమంగా సక్రమంగా నిర్వహించాలని, లేదంటే తిరుపతి ఉప ఎన్నికల్లో వక్రమార్గం పట్టిన అధికారుల సస్పెన్షన్ విషయాన్ని ప్రస్తావిస్తూ , ఈ ఎన్నికలలో దొంగ ఓట్లు సూత్రధారులు, పాత్రదారులను బీజేపీ వదలదు అని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరీ హెచ్చరించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి పార్టీలతో పొత్తు ఉన్నా లేకపోయినా ఏపీలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నామని, ఆధారాలు తో సహాదొంగ ఓట్లు వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని. నకిలీ ఎపిక్ కార్డులపై సమాచారాన్ని బీజేపీ దృష్టి కి రావాలని ఆమె పిలుపునిచ్చారు.
అధికార పార్టీ అక్రమాలు..
రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ దొంగ ఓట్లు తో గట్టెక్కాలని చూస్తోందని, .తక్కువ మార్జిన్ తో సీట్లను కోల్పోతామని భావించే నియోజకవర్గాల్లో ఈ తరహా కుట్రకు అధికార పార్టీ నాంది అ పలుకుతోందని పురందేశ్వరీ అనుమానం వ్యక్తం చేశారు. . రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయని ప్రజలకి తెలియచేశామని. పల్లెకి పోదాం పేరుతో బీజేపీ నాయకులు గ్రామాలలో నివసించి ప్రజలతో మమేకమై రాష్ట్రానికి మోదీ సేవల గురించి వివరించామన్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం అనేది ఒక గొప్ప కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని, ఈ ఆలయ నిర్మాణం జరిగితే హిందూ – ముస్లీంల మధ్య గొడవలు తలెత్తుతాయన్న విమర్శలని తిప్పి కొట్టగలిగామని, వివాదాలకు తావు లేకుండా ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణం అనేది జరిగిందని, ప్రజా పూరి యాత్ర కూడా బీజేపీ శ్రీకారం చుట్టిందని పురందేశ్వరీ వివరించారు.
రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నిధులే ఎక్కువ..
ప్రతి జిల్లాలో అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం నిధులు నిధులు ఇచ్చిందని, బీజేపీ కే ప్రజలు పట్టం కట్టాలని ఆమె పిలుపు నిచ్చారు. అలాగే రాష్ట్రంలోని నకిలీ ఓటు కార్డు లు జారీ చేసారో ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే ఐఏఎస్అధికారులను చీఫ్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. వలంటీర్లను పోలింగ్ ఏజెంట్స్ గా వినియోగుంచుకుంటాం అని ధర్మాన వ్యాఖ్యానించారు. ఎలక్షన్ కమిషనే వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలని నిర్ణయించిందని, వలంటీర్లను ఎట్టిపరిస్థితిలోనూ ఎన్నికలకు దూరంగా ఉంచాలని మేము కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని, తిరుపతి ఉపఎన్నికల్లో తప్పుడు దారిలో గెలిచిన వ్యక్తి పై అనర్హుడిగా గుర్తించి ఎన్నికను రద్దు చేయాలనీ ఎన్నికల దృష్టికి గతంలోనే తీసుకెళ్ళామని పురందేశ్వరీ వివరించారు.