పీఏసీ కమిటీకీ ముగిసిన నామినేషన్ల పర్వం
కూటమి నుంచి 12 స్థానాలకు దరఖాస్తులు
వైసీపీ నుంచి పెద్దిరెడ్డితో సహా నలుగురు నామినేషన్
ఎమ్మెల్యే కోటా నుంచి పెద్దిరెడ్డి పోటీ
20 ఓట్లు వస్తేనే పీఏసీ సభ్యుడిగా గెలుపు
వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 స్థానాలే
పెద్దిరెడ్డి గెలుపు అసాధ్యమే
ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి:
పీఏసీ ఛైర్మన్ పోస్ట్ జనసేన ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులుకు దక్కనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆయన పేరును ప్రతిపాదించారు. ఇక కొద్దిసేపట్లో పులిపర్తి పేరును ప్రకటించడం లాంఛనంకానుంది. కాగా, పీఏసీలోని మొత్తం 12మందిని ఎన్నుకునేందుకు గురువారం నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. కూటమి తరుపును అసెంబ్లీ నుంచి 9 మంది, మండలి నుంచి 3 తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
వైసీపీకి ఎదురుదెబ్బ..
అసెంబ్లీ నుంచి వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయగా, మండలి నుంచి ముగ్గురు సభ్యులు నామినేషన్ అందజేశారు.. కాగా, అసెంబ్లీ నుంచి పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే 20 ఓట్లు అవసరం..కాగా, వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 సీట్లే ఉండటంతో పెద్దిరెడ్డి గెలుపు అసాధ్యం కానుంది. కూటమి నుంచే మొత్తం తొమ్మిది మంది ఎన్నిక కానున్నారు.. వారిలో జనసేన తరుపున బరిలో నిలచిన పులిపర్తి రామాంజనేయులు పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక కానున్నారు.. ఈ మేరకు జనసేన చేసిన ప్రతిపాదనను కూటమిలోని ఇతర పార్టీలు అంగీకరించాయి.. నామినేషన్ల పరిశీలన అనంతరం ఎన్నికైన సభ్యుల పేర్లను అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించనున్నారు.