Thursday, November 21, 2024

AP – పీఏసీ చైర్మన్‌గా జ‌న‌సేన అభ్య‌ర్థి – రామాంజ‌నేయులు పేరు ప్ర‌క‌టించిన ప‌వ‌న్

పీఏసీ క‌మిటీకీ ముగిసిన నామినేష‌న్ల ప‌ర్వం
కూట‌మి నుంచి 12 స్థానాల‌కు ద‌ర‌ఖాస్తులు
వైసీపీ నుంచి పెద్దిరెడ్డితో స‌హా న‌లుగురు నామినేష‌న్
ఎమ్మెల్యే కోటా నుంచి పెద్దిరెడ్డి పోటీ
20 ఓట్లు వ‌స్తేనే పీఏసీ స‌భ్యుడిగా గెలుపు
వైసీపీకి అసెంబ్లీలో కేవ‌లం 11 స్థానాలే
పెద్దిరెడ్డి గెలుపు అసాధ్యమే

ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి:
పీఏసీ ఛైర్మ‌న్ పోస్ట్ జ‌న‌సేన ఎమ్మెల్యే పులిప‌ర్తి రామాంజ‌నేయులుకు ద‌క్క‌నుంది. ఈ మేర‌కు ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆయ‌న పేరును ప్ర‌తిపాదించారు. ఇక కొద్దిసేప‌ట్లో పులిప‌ర్తి పేరును ప్ర‌క‌టించ‌డం లాంఛ‌నంకానుంది. కాగా, పీఏసీలోని మొత్తం 12మందిని ఎన్నుకునేందుకు గురువారం నామినేష‌న్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. కూట‌మి త‌రుపును అసెంబ్లీ నుంచి 9 మంది, మండ‌లి నుంచి 3 త‌మ నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారు.

వైసీపీ నుంచి అసెంబ్లీ నుంచి వైసీపీ త‌ర‌పున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేయ‌గా, మండ‌లి నుంచి ముగ్గురు స‌భ్యులు నామినేష‌న్ అంద‌జేశారు.. కాగా, అసెంబ్లీ నుంచి పీఏసీ స‌భ్యుడిగా ఎన్నిక కావాలంటే 20 ఓట్లు అవ‌స‌రం..కాగా, వైసీపీకి అసెంబ్లీలో కేవ‌లం 11 సీట్లే ఉండ‌టంతో పెద్దిరెడ్డి గెలుపు అసాధ్యం కానుంది.

వైసిపి నామినేషన్ ఉపసంహరణ జరగకపోతే శుక్రవారం అసెంబ్లీ కమిటీహాల్లో పీఏసీ సభ్యత్వానికి పోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పద్ధతిలో సభ జరిగే సమయంలోనే పోలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. తెలుగుదేశం తరఫున పీఏసీ సభ్యత్వానికి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నామినేషన్లు వేశారు. జనసేన తరఫున పులపర్తి రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు. భాజపా తరఫున పీఏసీ సభ్యత్వానికి విష్ణు కుమార్ రాజు నామినేషన్ వేశారు.

ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యాక పీఏసీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పేరును స్పీకర్ ప్రకటించ‌నున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement