హైదరాబాద్, ఆంధ్రప్రభ న్యూస్ నెట్‌వర్క్ ఇన్‌చార్జి: ఒక్క సమ్మిట్.. ఒకే ఒక్క సమ్మిట్ తో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలను మార్చేలా, భవిష్యత్‌పై భరోసా కల్గించేలా, రాజకీయ ప్రత్యర్ధులు సాగిస్తున్న ప్రచారానికి తెరదించి చెవులు రింగుమనేలా, విశాఖ గడ్డపై నుండే జగన్ విజయనాదం చేశారు. ఇంతకాలం సంక్షేమ ప్రచారం, బటన్‌లు నొక్కుడు తప్ప.. పెట్టుబడులు లేవు అంటూ పరిహాసం చేసిన వారు విస్తుపోయేలా అసాధరణం, అద్భుతం, మైండ్ బ్లోయింగ్ అనిపించే పెట్టుబడుల వర్షం విశాఖపై, ఆంధ్రప్రదేశ్ పై కురిపించారు. చరిత్ర ఎరుగని పెట్టుబడుల వర్షం, సౌత్ ఇండియాలో ఏ పెట్టుబడుల సమ్మిట్ కు హాజరుకాని ప్రపంచదిగ్గజ కంపెనీలు, దేశంలోనే నెంబర్ వన్, టూ, త్రీ.. ఇలా అన్ని కంపెనీల అధినేతలు విశాఖలో ప్రత్యక్షమైతే దేశమే ఔరా అంటూ ఆశ్చర్యంగా చూసింది. ఒకటి కాదు, రెండు కాదు.. 340 పెట్టుబడుల ప్రతిపాదనలు, 13లక్షల కోట్ల పెట్టుబడులు, 6లక్షల ఉద్యోగాలు.. ఈసమ్మిట్ ద్వారా సగర్వంగా ప్రకటించిన ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. జగన్ మంచి మనసు, భవిష్యత్తుపై దార్శనికత వల్లే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడుతున్నామని దిగ్గజ కంపెనీలు ప్రకటించడం, తెరవెనుక జగన్ చేసిన కఠోరశ్రమకు, వ్యూహానికి అద్దం పడుతున్నాయి. వ్యాపార విస్తరణకు ఎపి ఉత్తమం అంటూ దిగ్గజ కంపెనీల అధినేతలు ఎపిలో అనుకూల పరిస్థితులకు, జగన్ సమర్ధతకు సర్టిఫికెట్ ఇచ్చేశారు.
వైసీపీలో నూతనోత్సాహం
‘సంక్షేమం విషయంలో తిరుగులేని ముద్ర వేసిన జగన్.. గత మూడున్న రేళ్ళు గా పెట్టుబడులు, రాజధాని విషయంలో ప్రత్యర్ధుల నుండి ప్రశ్నలు ఎదు ర్కొం టున్నారు. వాటన్నింటికీ ఒకే ఒక్క సమ్మిట్ ద్వారా చెక్ పెట్టారు. విశాఖలో జరిగిన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు ద్వారా ఇదీ జగనంటే అంటూ ఈ ప్రశ్నల న్నింటికీ ఒక్క దెబ్బతో దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. జగన్ దెబ్బతో వైసీపీ సర్కార్ వన్స్ మోర్ బంపర్ విక్టరీ ఖాయమని ఆ పార్టీ శ్రేణులు సంబుర పడు తున్నాయి. విశాఖ సమ్మిట్ తో ఎపి వ్యాప్తంగా అటు పార్టీ వర్గాల్లో, ఇటు ప్రజల్లో నూతనోత్సాహం కనబడుతోంది. జగన్ వ్యూహం పక్కాగా సక్సెస్ అయింది.