Friday, November 22, 2024

AP | ఢిల్లీ చేరిన ఏపీ రాజకీయం.. 28న హ‌స్తిన‌కు చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ: ఎన్నికలు గడువు ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు రాష్ట్రానికే పరిమితమైన రాజకీయాలు, ఇప్పుడు హస్తినకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, జాబితాలో అవకతవకలు, అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఈ నెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా సీఈసీని కలిసి ఈ అక్రమాలపై ఫిర్యాదు చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు చంద్రబాబు హస్తిన టూర్‌ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీఈసీని కలిసేందుకు వెళ్తున్న చంద్రబాబు పనిలో పనిగా బీజేపీ కేంద్ర పెద్దలను కలిసేందుకు సిద్ధం కావడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. పార్టీ యంత్రాంగం ఎంపీల ద్వారా ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాల అపాయింట్‌మెంట్‌ కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.

ఇక అలాగే బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డాను కూడా కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఒకసారి నడ్డాతో పాటు మరికొందరు బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం ఇటీవల తొలిసారి బీజేపీ అగ్రనేతల తో భేటీ అయిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో పొత్తులపై మరోసారి ఆ పార్టీతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇంకోవైపు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో బీజేపీ ఆగ్రనాయకత్వం కూడా టీడీపీతో మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు హస్తిన టూర్‌ ప్రోగ్రామ్‌ ఉన్నట్లుగా సమాచారం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై ఒకేసారి నిర్ణయానికి రావాలన్న యోచనలో రెండు పార్టీలు ఉండటంతో సంప్రదింపులు మళ్లిd ప్రారంభమయ్యాయి. ఒకవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తరచూ పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీతో మైత్రీ బంధం బలపడినా బీజేపీ వైఖరిపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో జనసేనాని కూడా బీజేపీ అగ్రనాయకత్వాన్ని పొత్తులకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలె తెలుగు రాష్ట్రాల బీజేపీ చీఫ్‌లను ఆ పార్టీ అధిష్టానం మార్పు చేసింది. కొత్త నాయకత్వం పొత్తులకు కొంత పాజిటివ్‌గానే కనిపిస్తుండటంతో దీనిపై మళ్లిd ఆశలు చిగురిస్తున్నాయి.

ఈసారి చంద్రబాబు హస్తినలో బీజేపీ అగ్రనేతలతో భేటీ కన్ఫార్మ్‌ అయితే పొత్తులపై పూర్తి క్లారిటీ వస్తుందన్న భావనలో టీడీపీ నేతలు ఉన్నారు. పొత్తులు లేకున్నా తమకు ఇబ్బంది లేదని అయితే రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా కేంద్రం సపోర్ట్‌ అవసరముందని ఈ నేపథ్యంలోనే ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీకి పలు బిల్లుల అంశంలో టీడీపీ ఎటువంటి షరతులు లేకుండా సపోర్ట్‌ చేసింది. ఆ పార్టీ అగ్రనేతలు చంద్రబాబు స్వయంగా మాట్లాడటంతో ఆయన కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు తాజా ఢిల్లిd టూర్‌ కూడా ఫలప్రదమవుతుందన్న ఆశాభావంలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. ఎన్టీఏలో చేరికపై కూడా పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో చంద్రబాబు టూర్‌ ఆసక్తిగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement