“అన్యాయంగా బూతులు తిడుతున్నారు. అవి భరించలేక నా అభిమానులు రియాక్టవుతున్నారు. నేనంటే ప్రజలకు ప్రాణం.. అది విపక్షం భరించలేకపోతోంది. నేనెప్పుడైనా అలా మాట్లాడానా? రాజకీయ లబ్ధికోసం టీడీపీ జిత్తులుపన్నుతోంది”
అమరావతి, ఆంధ్రప్రభ : ప్రజలు పెద్ద ఎత్తునప్రేమ, ఆప్యాయతలు చూపుతూంటే జీర్ణించుకోలేని ప్రధాన ప్రతిపక్షం, దానికి వంతపాడుతున్న ఓ వర్గం మీడియా తనపై అనరాని మాటలు, తిట్లతో దాడి చేస్తున్నారని, బూతులతో కించపరుస్తున్నారని.. ఆ మాటలు విని భరించ లేని అభిమానులు, ప్రజలు ప్రతిస్పందిస్తున్నారని సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంగళవారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంతోపాటు పలుచోట్ల వైకాపా అభిమానులుగా భావిస్తున్న కొందరు దాడులకు పాల్పడిన నేపథ్యంలో సీఎం జగన్ స్పందించారు. రెండున్నరేళ్లుగా దీక్షగా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు మంచి చేస్తూంటే అది అడ్డుకునేందుకు, ప్రజల్లో కుల,మత వైషమ్యాలు రెచ్చగొట్టేందుకే ఈ తిట్ల కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విపక్ష నేతగా కాని, ముఖ్యమంత్రి గా కానీ తానెప్పుడూ ఇలాంటి దుర్భాషలు, వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాల యంలో బుధవారం జగనన్న తోడు పథకం కింద వడ్డీ జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ఎవరూ కూడా మాట్లాడలేని అన్యాయమైన మాటలు, అన్యాయమైన బూతులు మాట్లాడటం తెలుగుదేశం నాయకులకు పరిపాటైపోయిందని అన్నారు.
ఇప్పటివరకు ఎవరూ కూడా ఇటువంటి మాటలు మాట్లాడి ఉండరని అన్నారు. తనను నీచంగా తిడుతూంటే, టీవీల్లో వచ్చే ఆ వ్యాఖ్యలు, ఆ బూతులు వినలేకతమను అభిమా నించే వాళ్లు, ప్రేమించే వాళ్లు స్పందించి ఉండవ చ్చన్నారు. తమను అభిమానించే వాళ్లు, ఆప్యాయత చూపేవాళ్ల రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోందని, ఆ రకంగా కావాలని తిట్టించి వైషమ్యాలను క్రియేట్ చేయించి, తద్వారా రాజకీ యం గా లబ్ధి పొందాలన్న ఆరాటం మన కర్మ కొద్దీ మన రాష్ట్రం లో కనిపిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాల్లో ఏనాడూ కులం, మతం, పార్టీ చూడ లేదని స్పష్టం చేశారు. ప్రాం తాలు కూడా పట్టిం చుకోలేదన్నారు.
ఏ ప్రాంతమైనా తనదే అన్న రీతిలో వ్యవహరించానని చెప్పారు. అర్హతే ప్రాథమ్యంగా సంక్షేమ పథకాలను ప్రజల ఇంటి ముం గిటకు చేర్చా మన్నారు. సచివాలయ వ్యవస్థతో గ్రామాల రూపు రేఖలు మార్చామని తెలి పారు. ఇదే తెలుగుదేశం పార్టీ నేతలకు కంటకింపుగా మారిందని పేర్కొన్నారు.
టీడీపీది వక్రబుద్ధి
తెలుగుదేశం నేతలే అబద్ధాలు ఆడతారు, అసత్యాలు ప్రచారాలు చేస్తారని చెప్పారు. వారు వేసే ప్రతి అడుగులోనూ వంచన కనిపిస్తుందని చెప్పారు. ప్రతి మాటలోనూ, ప్రతి రాతలోనూ అబద్ధాలతో మోసం చేసే వక్రబుద్ధే కనిపిస్తుందన్నారు. మత విద్వేషాలను కూడా రెచ్చగొచ్చడానికి ఏ మాత్రం కూడా వెనుకాడటం లేదని, కులాల మధ్య, మతాల మధ్య కూడా చిచ్చు పెడు తున్నారన్నారు. ఇష్టమొచ్చినట్లు- కార్యక్రమాలు చేయ డం, వ్యవస్ధలను పూర్తిగా మేనేజ్ చేయడం వంటి పరిస్థి తులు మన కళ్లముందే కనిపిస్తున్నాయని చెప్పారు.
ఏ పేదవాడికి మంచి జరుగుతున్నా ఆ మంచి జరగకూ డదని, ఒకవేళ జరిగితే ఎక్కడ జగన్‌కు మంచి పేరు వ స్తుందో అన్న కుట్రతో ఆ మంచిని ఆపేందుకు రక రకా లు గా కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా రకరకాల వక్రీకరణ రాతలు కూడా రాయి స్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ జరుగుతున్నా, ఇటు-వంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పటికీ రెండున్నర సంవత్సరాల పరిపాలన మనస్ఫూర్తిగా, సంతృపి ్తనిచ్చే విధంగా చేయగలిగానని పేర్కొన్నారు. భవిష్యత్ లోనూ ఇంకా మంచి చేయడానికి కూడా వెనుకడుగు వేయనని హామీ ఇచ్చారు.
ప్రజలు ఇచ్చిన ఈ అధికారంతో సచివాలయ, వాలంటీ-ర్ వ్యవస్ధ తీసుకొచ్చి గ్రామ స్ధాయి నుంచి ఎక్కడా కూడా వివక్ష లేకుండా, అవినీతి లేకుండా, బటన్ నొక్కిన వెంటనే నేరుగా లబ్ధిదారుని ఖాతాల్లోకి వెళ్లేటట్టుగా (డీబీడీ ద్వారా) చర్యలు తీసుకున్నామన్నారు.