కొత్త సంవత్సరంలో భాగంగా ఏర్పాటు
పోలీసుల రైడ్.. 18 మంది అరెస్ట్
అరెస్ట్ అయిన వారిలో
రాజమహేంద్రవరం – కొత్త సంవత్సరం రాకను పురుస్కరించుకుని ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.. ఈ ఘటన రాజమహేంద్రవరం సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాడి చేసిన పోలీసులు 13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.
వివరాలలోకి వెళితే కోరుకొండ మండలం, బూరుగుపూడి జంక్షన్ వద్ద నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగింది. ఫెర్టిలైజర్స్ షాపుల యజమానులు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు గత అర్ధరాత్రి రేవ్ పార్టీపై దాడి చేశారు. భారీగా మద్యాన్ని స్వాదీనం చేసుకున్నారు. అలాగే రేవ్ పార్టీలో పాల్గొన్న 13 మంది వ్యక్తులు, ఐదుగురు యువతులు, మూడు కార్లు స్వాధీనం చేసుకుని కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ దాడిపై రాజమండ్రి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మాట్లాడుతూ, ఈ రేవ్ పార్టీలో అందరూ మద్యం సేవించారని, డ్రగ్స్ వాడలేదని తెలిపారు. రాత్రి అంతా నాగ సాయి ఫంక్షన్ హాల్‌లో పెద్ద సౌండ్‌తో మ్యూజిక్ పెట్టుకుని, డ్యాన్సులు చేయడంపై స్థానికులు ఫిర్యాదు చేశారన్నారు.. దీంతో రేవ్ పార్టీపై దాడి చేసి భగ్నం చేశామన్నారు.