రైతులకు పెట్టుబడి సాయం
ఏటా రూ. 20వేలు ఇచ్చేందుకు రెడీ
ఈ విద్యాసంవత్సరం నుంచే తల్లికి వందనం
తక్షణమే పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం
ఎన్టీఆర్ రైతు భోరోసాకు గ్రీన్ సిగ్నల్
సచివాలయం ఉద్యోగుల రేషనలైజేషన్
ఉచిత బస్సు ప్రయాణ పథకంపై చర్చ
మరో 62 అన్నా క్యాంటీన్ల ఏర్పాటు
ఇన్వెస్టర్లకు నామ మాత్ర ధరకు భూ కేటాయింపులు
బనకచర్ల ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చ
ఏపీ కేబినెట్లో పలు కీలక పథకాలకు ఆమోదం
వెలగపూడి, ఆంధ్రప్రభ : తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని చంద్రబాబు కేబినేట్ నిర్ణయించింది. అలాగే పొలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం తక్షణం ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. గత వైసీపీ ప్రభుత్వం నిషేదిత జాబితా నుంచి తొలగించిన ఏడు లక్షల ఏకరాల భూమిపై నిర్ణయం తీసుకునేందుకు కేబినేట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయిచింది. ఇక పెర్రో ఎలాయిస్ పరిశ్రమలకు విద్యుత్ చార్జీల సబ్సీడీ ఇవ్వాలని కేబినేట్ నిర్ణయించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా.. కేబినేట్ మంత్రులంతా పాల్గొన్నారు.. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ మీటింగ్ ఇంకా కొనసాగుతున్నది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల రేషనలైజేషనకు చంద్రబాబు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.. సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలన్న లక్ష్యంతో 1.27 లక్షల మంది సచివాలయం ఉద్యో గులను రేషనలైజేషన్ చేయాలని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఫ్రీ బస్ పథకం.. ఎన్టీఆర్ రైతు భరోసా
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయాలని కేబినేట్ చర్చించింది.. ఈ పథకం అమలు కోసం ఏర్పాటు చేసిన కేబినేట్ సబ్ కమిటీ తన నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేసింది.. దీనిపైనే ఎక్కువ సమయం చర్చ జరిగినట్ల సమాచారం. రాష్ట్రంలో మరో 62 అన్నా క్యాంటిన్ల ఏర్పాటునకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ రైతు భరోసా ఇచ్చే అంశంపై చర్చ జరిగింది.. దీనిపై విధివిధానాలను ఖరారు చేశారు.. ఏపీలో మూడు పంటలు పండించే రైతులకు రూ.20 వేలు సాయం అందించే విషయంపై కేబినేట్లో చర్చ జరిగింది.
నధుల అనుసంధానం చేద్దాం..
ఏపీలో పెట్టుబడి పెట్టే పారిశ్రామిక వేత్తలకు భూమిని నామమాత్ర ధరలకే కేటాయించాలని కేబినేట్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాలలో గీత కార్మికులకు 10 శాతం కేటాయింపుకు ఆమోద ముద్ర వేసింది. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లేవనెత్తిన అభ్యంతరాలను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో నదుల అనుసంధానం జరగాల్సిదేనని మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.. ఇదే సమయంలో, అంతర్-రాష్ట్ర సంబంధాలను మెరుగుపరుచుకోవాలని కొందరు మంత్రులు సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కూడా ఏపీ కేబినెట్లో చర్చించారు.