Sunday, November 17, 2024

AP | పీజీసెట్ తుది విడత కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ విడుదల.. 16న సీట్ల కేటాయింపు

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీలో ఉన్న యూనివర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ పీజీసెట్‌-2023 తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇవ్వాల్టి (ఆదివారం) నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పీజీసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది.

పరీక్షలో అర్హత సాధించిన వారు నవంబరు 6 నుంచి 8 వరకు సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ కోసం నిర్ణీత ఫీజు చెల్లించి, రిజిస్ట్రేష్రన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ విద్యార్థులకు రూ.500గా ఫీజు చెల్లించాలి. ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు, కౌన్సెలింగ్‌ ఆప్షన్ల నమోదు వంటి ప్రక్రియలకు కౌన్సెలింగ్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, హాల్‌టిక్కెట్‌, పుట్టినతేదీ వివరాల ఆధారంగా లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది.

- Advertisement -

ఫీజు డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చు. అనంతరం విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. పీజీసెట్‌ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులకు మొదటి విడత కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిన సీట్ల భర్తీకి తుది విడత నోటిఫికేషన్‌ను ఉన్నతవిద్యామండలి తాజాగా విడుదల చేసింది ఏపీ పీజీసెట్‌ ద్వారా రాష్ట్రంలో ఉన్న 17 యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

పీజీసెట్‌ మూడు కేటగిరీల వారీగా నిర్వహించారు. కేటగిరీ-1లో ఆర్ట్స్‌, హ్యూమానిటీస్‌, సోషల్‌ సైన్సెస్‌, కేటగిరీ-2లో కామర్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, కేటగిరీ-3లో సైన్స్‌ సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష నిర్వహించారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకు కేటాయిస్తున్నారు.

రేప‌టినుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌

రేప‌టినుంచి 8వ తేదీ వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. 7 నుంచి 10వ తేదీ వరకు ధృవీకరణ పత్రాలను పరిశీలిస్తారు. 13 నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్‌లను నమోదు చేసుకోవాలి. 16వ తేదీన ఆప్షన్‌లను మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తారు. 18 వ తేదీ సాయంత్రం 6 తరువాత సీట్లను కేటాయిస్తారు. 20 నుంచి 23వ తేదీ లోగా అభ్యర్ధులు కేటాయించిన కళాశాలలో హాజరుకావాల్సి ఉంది.

కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు..

పీజీసెట్‌ హాల్‌టికెట్‌, పీజీసెట్‌ ర్యాంకు కార్డు, బదిలీ ధ్రువీకరణ పత్రం (టీసీ), డిగ్రీ మార్కుల మెమో, డిగ్రీ ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌, టెన్త్‌ మార్కుల మెమో, ఇంటర్‌ మార్కుల మెమో, డిప్లొమా మార్కుల మెమో, స్టడీ సర్టిఫికేట్స్‌, రెసిడెన్స్‌ సర్టిఫికేట్‌,ఆదాయ ధ్రువపత్రం (ఇన్‌కమ్‌ సర్టిఫికేట్‌), క్యాస్ట్‌ సర్టిఫికేట్‌, ఎకనామికల్లీ వీకర్‌ సెక్షన్‌ (ఈడబ్ల్యూఎస్‌) సర్టిఫి కెట్‌, లోకల్‌ స్టేటస్‌ సర్టిఫికెట్‌ వంటి ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement