Saturday, November 16, 2024

AP – పించన్ లను స్వ‌యంగా పంపిణీ చేయ‌నున్న‌ చంద్ర‌బాబు…

ఎపిలో జులై ఒక‌టో తేదిన ల‌బ్దిదారుల‌కు పించ‌న్ పంపిణీకి ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.. ఈ నేప‌థ్యంలో తాడేపల్లి మండలం పెనుమాక లో పెన్షన్ లబ్ధి దారులకు స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు . ఒక దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం ఇదే మొదటిసారి.

- Advertisement -

పెన్షన్ల పంపిణీలో ప్రతి నాయకుడు పాల్గొనాలి – టిడిపి పిలుపు

జూలై 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నాయకుడు సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొనాల‌ని తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చింది.. ఈ మేరకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు/ డివిజన్, వార్డు అధ్యక్షులు / క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ ఇన్‌చార్జ్‌లు/ ఇతర పదవుల్లో ఉన్న నాయకులు ఆయా సచివాలయం పరిధిలో ఇంటింటికీ వెళ్ళీ పెన్షన్లు పంపిణీ చేయాల‌ని కోరింది. స్థానిక ఎమ్మెల్యే/ఎంపీ/ ఇన్‌చార్జ్‌/ పార్లమెంట్ అధ్యక్షులు నియోజకవర్గంలోని అన్ని ఏరియాలలో కవర్ అయ్యే విధంగా కనీసం 10 లబ్ధిదారులకు పైగా పెన్షన్లను పంపిణీ చేసి సోషల్, మీడియాలో వచ్చేటట్లు చూడాల‌ని పేర్కొంది. ఆ రోజు మొత్తం నాయకులందరూ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంపైనే ఉండాల‌ని పిలుపు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement