Friday, November 22, 2024

AP | టీడీపీ వల్లే పెన్షన్ కష్టాలు : బొత్స

విజయనగరం చీపురుపల్లిలో నిన్న జరిగిన స్వర్ణాంద్ర సాకార సభలో టీడీపీ నేత బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. బాలకృష్ణ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ని కష్టపడి చదువుతున్నాడ‌ని విమర్శించారు. బాలకృష్ణ నువ్వు చెప్పింది కరెక్టేనా? నీ చేసిన‌ ఆరోపణలపై చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను? నువ్వు సిద్ధమా అని బాల కృష్ణకు బొత్స నారాయణ సవాల్ విసిరారు.

రాష్ట్రంలో ఉన్న విద్యావ్యవస్థ దేశంలో ఎక్క‌డా లేదని… టోఫెల్, ఇంగ్లీషు మీడియం వంటి విధానాలతో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి పేదవాడికి విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏపీ విద్యా విధానాన్ని ప్రధానమంత్రి అకడమిక్ అడ్వైజర్ కమిటీ ప్రశంసించిందని పేర్కొన్నారు. ఈ విద్యా సంస్కరణలు ఎన్టీఆర్ హయాంలో, చంద్రబాబు కాలంలో వచ్చాయా? అతను ప్రశ్నించారు.

టీడీపీ దుర్మార్గులు వేసిన‌ పిటిషన్ వల్లనే వృద్ధులు, వికలాంగులకు ఫించన్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో 33 మంది వృద్దులు చనిపోయారని, ఫించన్ దారుల ఉసురు ఖచ్చితంగా కొడుతుందన్నారు. దుర్మార్గుల దుర్బుద్ధి వల్ల ఫించన్ దారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని మండిప‌డ్డారు.

భూమి యజమానులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించడానికి ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఏర్పాటు చేశామ‌ని అన్నారు. భూసేకరణ చట్టం కోర్టులో ఉందని, కోర్టు తీర్పు తర్వాతే దాని అమలుపై ఆలోచిస్తామని చెప్పారు. రిజిస్ట్రేషన్ చేస్తే జిరాక్స్ కాపీలు ఇస్తామని టీడీపీ నేతలు భయపెడుతున్నారు. నెరపూరితమైన ఆలోచనలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. ఎన్నికల తర్వాత ఇలాంటి దుష్ప్రచారం చేసేవారిపై కేసులు పెడతామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement