ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య నియామకమయ్యారు. మూడేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్ నీరబ్ కుమార్‌నే పీసీబీ చైర్మన్ బాధ్యతలు చూస్తున్నారు. అంతకుముందు మాజీ సీఎస్ సమీర్ శర్మ.. పీసీబీ చైర్మన్‌గా పనిచేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులకు అనుకూలంగా పని చేశారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి.
ఆ సమయంలో ఆయన పీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వంలో సీఎస్‌గా పనిచేస్తున్న నీరబ్ కుమార్‌నే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం నీరబ్ స్థానంలో ఆ బాధ్యతలను రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య కు అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.
కాగా విజయవాడ యనమలకుదురు పీసీబీ బోర్డుకు సంబంధించిన డాక్యుమెంట్లు అవనిగడ్డ కరకట్టపై దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అప్పటి పీసీబీ బోర్డులో పనిచేసే డ్రైవర్ నాగరాజును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి బోర్డు చైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతోనే దగ్ధం చేసినట్లు నాగరాజు చెప్పారు. దీంతో సమీర్ శర్మపై ఆరోపణలు వెల్లువెత్తాయి.