Sunday, December 29, 2024

AP – అధికారుల‌పై దాడి చేస్తే తాట తీసుడే – వైసిపికి ప‌వ‌న్ క‌ల్యాణ్ వార్నింగ్

కడప – ఆధిపత్యం అహంకారంతో అధికారులపై దాడులు చేస్తున్నారు.. ఇష్టారీతిన చేస్తామంటే చూస్తూ ఊరుకోం.. తాట తీస్తామని వైసిపి నేత‌ల‌కు వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్. . అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాద‌ని అన్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి క‌డ‌ప‌ రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నఎంపిడివో జవహర్ బాబును ఆయన నేడు పరామర్శించారు. వైసిపి నేత‌ల దాడి వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆలాగే జ‌వ‌హ‌ర్ ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌తో మాట్లాడారు.. అనంత‌రం ప‌వ‌న్ మీడియాతో మాట్లాడుతూ, ఇంకా, ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నార‌ని, అందుకే ఎంపీడీవో జవహర్ బాబును అమానుషంగా కొట్టారని పేర్కొన్నారు.

వారికి అహంకారంతో వాళ్లకు కళ్లు నెత్తికెక్కాయ‌ని, వాటిని కింద‌కు దించుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు… ఘటనా స్థలానికి సీఐ వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్ కాలేదని తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వమ‌ని, .. వైసీపీది కాదని వాళ్ల‌ను ఎలా నియంత్రించాలో త‌మ‌కు తెలుసు అని అన్నారు. 11 సీట్లు వచ్చినా ఇంకా గాల్లో విహరిస్తున్నారని వైసిపి నేత‌ల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.. మండిపడ్డారు. మరోవైపు, సింహాద్రిపురంలో రైతు కుటుంబం ఆత్మహత్య దురదృష్టకరం అన్నారు. రైతు కుటుంబం ఆత్మహత్యపై పోలీస్ నివేదిక అడిగాం.. ఎవరైనా బలవంతం చేస్తే చనిపోయారా.. అనేది విచారణలో తేలుతుంది.. సినిమాల గురించి చర్చ పెట్టకండిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement